దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి సిద్ధం అవుతోన్న టీఆరెస్!

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి సిద్ధం అవుతోన్న టీఆరెస్!
x
Highlights

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్ కేటాయించారు. ఇక భారీ...

దుబ్బాక ఉపఎన్నిక ప్రచారానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్ కేటాయించారు. ఇక భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి సుజాతను కలిశారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సుధీర్ఘంగా చర్చించారు.

దుబ్బాక ఉపఎన్నికను అధికార పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ప్రచారం నిర్వహించాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన సోలిపేట సుజాతను టీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చిట్టాపూర్ గ్రామంలో సోలిపేట సుజాతను మంత్రి హరీష్ రావు కలిసి ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.

సోలిపేట రామలింగారెడ్డి అనేక ఉద్యమాలు చేశారని మంత్రి హరీష్ రావు గుర్తుచేశారు. రామలింగారెడ్డి మరణం చాలా బాధాకరమన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ఆయన సతీమణికి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించారని తెలిపారు. ఈ ఉపఎన్నికలో సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హరీష్ రావు అన్నారు. తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త చనిపోతే ఇంటికి వచ్చి కన్నతండ్రి వలె కొండంత ధైర్యం చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా ఉపఎన్నికలతో తమ సత్తాచాటాలని చూస్తున్నాయి. మరీ టీఆర్ఎస్ వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories