TRS: అమిత్‌షాపై టీఆర్ఎస్ నేతల మాటల తూటాలు

TRS Leaders Comments on Union Minister Amit Shah
x

TRS: అమిత్‌షాపై టీఆర్ఎస్ నేతల మాటల తూటాలు

Highlights

TRS: షా పచ్చి అబద్ధాలు చెప్పారని ఫైర్

TRS: కేంద్ర మంత్రి అమిత్ షా పై టీఆర్ఎస్ నేతలు విమర్శలతో విరుచుకు పడ్డారు. పచ్చి అబద్ధాలు చెప్పి వెళ్లారని ఫైర్ అయ్యారు. దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ చేశారు. అమిత్ షా అబద్ధాలకు బాద్ షా అని ఘాటు విమర్శలు చేశారు.

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ పై టీఆర్ఎస్ సీరియస్ గా రియాక్ట్ అయింది. కారు పార్టీ నేతలు విమర్శలతో దండయాత్ర చేశారు. పల్లెల నుంచి పట్టణాల దాకా అన్ని స్థాయిల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టికల్ 370 కి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదని అబద్దం చెప్పిన షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథకు కేంద్రం నిధులు ఇచ్చామని తప్పుడు మాటలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందస్తు ఎన్నికల కామెంట్స్ పై రివర్స్ ఎటాక్ చేశారు. దమ్ముంటే పార్లమెంట్ ను రద్దు చేసి దేశ వ్యాప్తంగా ఎన్నికలకు వెళ్లాలని బీజేపీకి సవాల్ విసిరారు. అమిత్ షా గాలి మోటర్లో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఓట్లు వేస్తే వడ్లు కొంటామని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడారని మండిపడ్డారు. 2500కోట్లకు కర్ణాటక సీఎం పదవిని అమ్మకానికి పెట్టిన బీజేపీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న పదహారు లక్షల ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories