మాజీ హోం మంత్రి నాయిని ఆరోగ్యం విషమం?

మాజీ హోం మంత్రి నాయిని ఆరోగ్యం విషమం?
x

Nayani Narasimha Reddy 

Highlights

Nayani Narasimha Reddy Test Positive : కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది... సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు..

Nayani Narasimha Reddy Test Positive : కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది... సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు ఈ వైరస్ బారిన పడుతున్నారు.. ఇందులో కొందరు కొలుకోగా మరికొందరు బలైపోతున్నారు.. అటు కరోనా బారిన పడిన ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది.. తాజాగా టీఆర్ఎస్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డికి గతవారం కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ విషయాన్ని ఆయనే తెలియజేశారు..

అయితే తనతో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.. ఇక ఇదిలా ఉంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.. దీనితో ఆయన చికిత్స పొందుతోన్న ఆస్పత్రిలోనే ఇంటెన్సివ్ కేర్‌కు తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూ ద్వారా చికిత్స అందిస్తున్నారు... ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలియడంతో టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలు దాటేశాయి. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 1,335 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనాతో మరో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,171కి చేరింది. అటు 2,176 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,00,611కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,72,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 27,052 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories