Flag Festival: సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

TRS Flag Festival on September 2nd
x

సెప్టెంబర్ 2 న తెరాస జెండా పండుగ (ఫైల్ ఇమేజ్)

Highlights

Flag Festival: ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు

Flag Festival: సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారు. ఈమేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ర్ట కార్యవర్గం, పార్టీ సర్పంచులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పార్టీ శ్రేణులకు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు.

గ్రామ, వార్డులో పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలన్నారు కేటీఆర్. సెప్టెంబర్ 2న ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ చేస్తున్న శంఖుస్థాపనకు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఈ జెండా పండగ విజయవంతానికి ‌కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలన్నారు.

టీఆర్ఎస్ జెండా పండగ తర్వత వెంటనే పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా కమీటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలన్నారు కేటీఆర్. సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు.. సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు మండల మరియు పట్టణ కమిటీలను నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబర్ 20వ తేదీ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక మరియు జిల్లా అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు రాష్ట్ర నాయకత్వం సమన్వయం చేసుకొని ప్రకటిస్తుందని తెలిపారు. జిల్లా కార్యవర్గాల ఎంపిక తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని ముఖ్యమంత్రి.. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ప్రకటిస్తారని కేటీఆర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories