టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ పార్టీ మారుతారనే గుసగుసలు.. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆఫర్స్...

TRS Ex MLC Santhosh Kumar Changing His Political Party | Live News
x

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ పార్టీ మారుతారనే గుసగుసలు.. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఆఫర్స్...

Highlights

Santhosh Kumar: కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని సంతోష్‌కు కాంగ్రెస్ ఆఫర్..!

Santhosh Kumar: గులాబీదళంలో అసంతృప్తులపై గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తారనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో బీసీ, ముస్లిం ఓటర్లలో మంచి పట్టు ఉన్న ఎమ్మెల్సీ సంతోష్ కుమార్‌కు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు టాక్ నడుస్తోంది. తన రాజకీయ భవిష్యత్‌పై సన్నిహితులతో సంతోష్‌కుమార్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్‌లోకి జాయిన్ అయ్యేముందు సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. గులాబీ దళాన్ని వీడితే ఆయన బీజేపీలో చేరుతారా? లేదంటే మాతృపార్టీ కాంగ్రెస్‌లోకి వెళతారా అనేది సమీప భవిష్యత్తులో తెలుస్తుందని పొలిటికల్ టాక్ నడుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories