టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త వీరంగం.. బ్యూటీ పార్లర్‌పై దాడి

టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త వీరంగం.. బ్యూటీ పార్లర్‌పై దాడి
x
Highlights

హైదరాబాద్ రాంగనర్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త దౌర్జన్యానికి దిగాడు. భారత్ బంద్‌ పేరుతో ఓ బ్యూటీ పార్లర్‌పై దాడి చేశాడు. బంద్ కారణంగా పార్లర్‌ను మూసివేయాలంటూ నిర్వాహకులపై వీరంగం ఆడాడు.

హైదరాబాద్ రాంగనర్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త దౌర్జన్యానికి దిగాడు. భారత్ బంద్‌ పేరుతో ఓ బ్యూటీ పార్లర్‌పై దాడి చేశాడు. బంద్ కారణంగా పార్లర్‌ను మూసివేయాలంటూ నిర్వాహకులపై వీరంగం ఆడాడు. టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త దాడిలో పార్లర్‌ ఫర్నిఛర్‌తోపాటు టీవీ ధ్వంసమైంది.మొన్నటి GHMC ఎన్నికల్లో బీజేపీకి ఓటేశామన్న కక్షతోనే తమపై దాడిచేసి షాపును ధ్వంసం చేశారని సాయి బ్యూటీ పార్లర్ సెంటర్ నిర్వాహకుడు వీరేందర్ ఆరోపిస్తున్నాడు. బంద్ పేరుతో తమ పార్లర్‌ను మూసివేయాలంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త హరిబాబు యాదవ్ దౌర్జన్యానికి దిగాడని తెలిపారు.

తన అనుచరులతో కలిసి తమపై దాడిచేసి పార్లర్‌ను ధ్వంసం చేశారని వాపోయాడు. పార్లర్‌ను మూసివేస్తామని చెబుతున్నా వినకుండా షాపులోకి చొరబడి దౌర్జన్యం చేశారన్నారు. తాజా ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఓడిపోయిన అక్కసుతోనే బీజేపీ అభిమానులపై దాడులకు పాల్పడుతున్నారని సాయి బ్యూటీ పార్లర్ సెంటర్ నిర్వాహకుడు వీరేందర్ ఆరోపిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ముషీరాబాద్ పోలీసులు... ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories