TRS 20 ఏళ్ల ప్రస్థానం..

TRS 20 ఏళ్ల ప్రస్థానం..
x
TRS Party
Highlights

దేశంలో రెండు దశాబ్దాలపాటు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో నిలబడిన పార్టీలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు అందులో టిఆర్ఎస్ పార్టీ ఒకటి.

దేశంలో రెండు దశాబ్దాలపాటు ప్రజాదరణ పొందుతూ ప్రజల్లో నిలబడిన పార్టీలు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు అందులో టిఆర్ఎస్ పార్టీ ఒకటి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, ఆయన ఉక్కు సంకల్పం, వ్యూహ చతురత ముందు ఆ విధి సైతం తలవంచింది. ఒక ఉద్యమం కోసం స్థాపించిన పార్టీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా రాష్ట్రంలో చక్రం తిప్పుతుంది. ప్రస్తుతం 60 లక్షల మంది కార్యకర్తలతో టిఆర్ఎస్ పార్టీ ఈనాడు అజయ శక్తిగా నిలిచింది.

ఈ పార్టీ 20 ఏండ్ల ప్రస్థానం గురించి చెప్పాలంటే ఆనాటి జలదృశ్యం నుంచి ఈనాటి సుజల దృశ్యం వరకు అని చెప్పవచ్చు. 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు తెలంగాణ సీఎం కేసీఆర్. దీనికి నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఏండ్లనుంచి సాగిన ఉద్యమం 1969వ సంవత్సరంలో ఆగిపోవడంతో రాష్ట్ర ప్రజలు ఆశలు సన్నగిల్లాయి. రాష్ట్రం కోసం పోరాడే నాయకుడు ఎప్పుడో వస్తాడని ఆశగా ఎదురు చూశారు జనం. కేసీఆర్ రాకతో ప్రజల నమ్మకం బలపడింది. ప్రత్యేక రాష్ట్రంసాధన 2001 ఏప్రిల్‌ 27న కేసీఆర్ ఉద్యమ పార్టీని స్థాపించి తొలి అడుగు వేశారు. ధృఢసంకల్పంతో రాష్ట్రాన్ని సాధించాడు. 2014లొ తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన శాసనసభ ఎన్నికలో అత్యధిక స్థానాలు గెలుపొంది కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories