Telangana: పీఆర్‌సీపై నివేదిక ఇచ్చిన త్రిసభ్యకమిటీ

Tripartite Committee Reporting on PRC
x

పీఆర్సి నివేదిక (ఫైల్ ఇమేజ్)

Highlights

Telangana: పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 7.5 శాతంగా తేల్చిన కమిటీ సీఎస్‌తో పాటు ముఖ్యమంత్రితోనూ భేటీ

Telangana: తెలంగాణలో పీఆర్సీ అంశం ఉద్యోగుల నుంచి రాజకీయ నాయకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో సమావేశం కావడం అస్త్రంగా మలుచుకుని ఉన్నారన్న టాక్‌ నడుస్తోంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పడం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే చర్చ నడుస్తోంది. ఇంతకీ ప్రగతిభవన్‌ కేంద్రంగా ఏం జరుగుతోంది.?

దాదాపు రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 31 నాడు బిశ్వాల్ కమిటీ... సీఎస్ సోమేష్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్యకమిటీకి పీఆర్సీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో

పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 7.5 శాతంగా సూచించింది. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు మళ్లీ సీఎస్‌తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ భేటీ అయ్యారు. సీఎం ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి అభిప్రాయాలను స్వీకరించింది. ఫిట్‌మెంట్‌ను 62 శాతంగా ఇవ్వాలని కొన్ని సంఘాలు, 63 శాతం ఇవ్వాలని మరికొన్ని సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఫిట్‌మెంట్ అంశం సీఎం కేసీఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది.

తెలంగాణ రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 14వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎలాగైనా గెలవాలన్నది కేసీఆర్‌ వ్యూహం. ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా ఇన్‌ఛార్జిలను నియమించి ఎన్నికలను క్లో‌జ్డ్‌గా మానిటరింగ్‌ చేస్తున్నారు. ఇది ఇలాఉంటే మరోవైపు అన్ని వర్గాల ప్రజలను కూడా ఆకట్టుకునేందుకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. ఇందులోభాగంగా ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యి... ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాకుండా పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ఉద్యోగులు సీఎంను కోరారు. మరోవైపు పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఐఆర్ కంటే తగ్గకూడదని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు.

బిశ్వాల్ కమిటీ ఫిట్‌మెంట్ 7.5 శాతంగా నివేదిక ఇస్తే సీఎం కేసీఆర్ మాత్రం ఏపీ ఇచ్చిన ఐఆర్ కంటే ఎక్కువగా సుమారు 29 శాతం వరకు ఫిట్‌మెంట్ ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. మరి కొంత మంది ఉద్యోగులు 33శాతం ఫిట్‌మెంట్ వస్తుందనే ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల వయోపరిమితి పెంపుపై ఈ నెలాఖరుకు నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగులకు సీఎం హామీ ఇచ్చినట్టుగా తెలిసింది.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఉమ్మడి ఆరు జిల్లాల పరిధిలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సమయంలో ఉద్యోగులతో సీఎం కేసీఆర్ మాట్లాడడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తన మాయమాటలతో ఉద్యోగులను మచ్చిక చేసుకోవాలని కేసీఆర్‌ చూస్తున్నారంటున్నాయి. 32 నెలలుగా పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఉద్యోగులను పిలిపించి మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సీఎంతో ఉద్యోగుల భేటీ అంశం ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఏమైనా... గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ లబ్ధి చేకూరుతుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories