Girijana Bandhu Scheme: గిరిజనోత్సవం ఒకే... గిరిజన బంధు ఎప్పుడు..?

Girijana Bandhu Scheme: గిరిజనోత్సవం ఒకే... గిరిజన బంధు ఎప్పుడు..?
x

Girijana Bandhu Scheme: గిరిజనోత్సవం ఒకే... గిరిజన బంధు ఎప్పుడు..?

Highlights

CM Kcr: రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచూస్తోన్న గిరిపుత్రులు

CM Kcr: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ.. వేడుకలు ఘనంగా నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. ఈ వేడుకల్లో గిరిజన బంధుపై సీఎం క్లారిటీ ఇస్తారని ఎదురుచుస్తున్నారు గిరిజనులు.

రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ 6 నుంచి 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమయింది ప్రభుత్వం. పోడు భూముల సమస్య కూడా తొందరలోనే పరిష్కారం జరుగనుంది. ఆదివాసీలకు భూములు ఇవ్వడం ద్వారా ఎంతమందికి లాభం చేకూరనుందన్న దాని పై ప్రజలకు వివరించడానికి సిద్ధమయింది ప్రభుత్వం.

రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆదివాసీల జనాభా దాదాపు 32 లక్షల మంది ఉన్నారు. 8 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 500 జనాభా కంటే ఎక్కువగా గిరిజన ఆదివాసీ గ్రామాలు 3 వేల 416 ఉండగా, 500 జనాభా కంటే తక్కువ దాదాపు 5 వేల గ్రామాలు ఉన్నాయి. ఈ జనాభాలో బంజారాలు 62 శాతం, ఆదివాసీలు 38 శాతం ఉన్నారు.. రాష్ట్ర ఏర్పాటు తరువాత రాష్ట్రంలో 3 లక్షల ఎకరాల పొడుభూమిని 97 వేల మందికి పంపిణీ చేశారు. 4 లక్షల ఎకరాల భూమికి దరఖాస్తులు ఇప్పటికే వచ్చాయి. మిగితా వారికి కూడా తొందరలోనే భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం.

అర్హులైన ఆదివాసీ గిరిజనులకు భూమి పంపిణీ చేస్తే మరో 300 కోట్ల రూపాయల నిధులు అవసరం. ఈ నెలలోనే ఆదివాసీలకు పట్టాలు ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వారికి తొందరలోనే పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గిరిజన బంధుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గిరిపుత్రులు. ఎప్పటి నుంచి ప్రభుత్వం గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తోందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories