కనుమరుగవుతున్న తెలంగాణ ఆది ధ్వని

కనుమరుగవుతున్న తెలంగాణ ఆది ధ్వని
x
Highlights

జానపదులు తయారుచేసుకొన్న వాద్యసంగీత పరికరాలు కూడా ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఆదివాసీలకు తమ పూర్వికులు ఎలాంటి వాయిద్యాలను వాయించారో తెలియని పరిస్థితి నెలకొంటుంది.

తెలంగాణ రాష్ట్రం అంటే చాలు సాంప్రదాయాల్లో ఒక ప్రత్యేకతను చాటుకుంది. అన్ని కులాలు, మతాలు, తెగలు వారి వారి పండగలను సాంప్రదాయాలను పాటిస్తాయి. తెలంగాణాలో ము‌ఖ్యంగా బోనాలు, బతుకమ్మ, సమ్మక్క సారలమ్మ జాతర లాంటి ఎన్నో పండుగలు పెద్ద ఎత్తున జరుగుతాయి. అంతే కాదు తెలంగాణలో అన్ని కళలను ప్రదర్శిస్తారు. ఒకప్పటి కాలంలో జానపద, హస్తకళలు, వీధి నాటకాలు ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుత కాలంలో కొన్ని కళలను మరచిపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే జానపదులు ఒకనాడు తయారుచేసుకొన్న వాద్యసంగీత పరికరాలు కూడా ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఇప్పుడున్న ఆదివాసీలకు, గోండు జాతులకు చెందిన వారికి తమ పూర్వికులు వారి కాలంలో ఎలాంటి సంగీత వాయిద్యాలను వాయించారో, అసలు ఆ వాయిద్యాలను ఏమని పిలుస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి దశలోనే తెలంగాణ ఆదిధ్వని వేదిక కన్వీనర్ గూడూరు మనోజ అంతరించి పోతున్న వాయిద్యాలకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడున్న యువతకు తెలియజేయడానికి శ్రీకారం చుట్టింది. అంతరించిపోతున్న వాయిద్యాలను, ఆ వాయిద్యాలను వాయించే కళాకారులతో మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనలను ఏర్పాటుచేశారు.

నేటి సమాజంలో అంతరించిపోతున్న ఈ సంగీత వాద్యాల ఆనవాలను ఒకవేదికమీదకు తీసుకొచ్చారు. ఈ నెల 13 వరకు జరిగే ఈ ప్రదర్శనలో ఆదివాసీలు ఎక్కువగా ఉపయోగించిన నగారా, గోండి, బస్తర్ నగారా, దుబ్బు, ఔజం, వీరణాలు, రుంజలు, కోయడోలు, గంపులు, గజ్జెలు, తాటి బూర, బుర్ర వీణ, తంబూర, తాన్‌పూరి, సింబుల్స్ లాంటి 124 వాద్యాలను ఒకే వేదికపై ఉంచారు. ఆదివాసీలు అంతా కలిసి వారి ఒక సమూహంగా ఏర్పడి ఈ వాయిద్యాలను వాయించు కుంటూ వారి అలసటను మర్చిపోయేవారు. అలాంటి ఈ వాయిద్యాలు కనుమరుగవకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, గౌరవ అతిథులుగా సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, నాగ్ అశ్విన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని చూసిన వారు సంగీతానికి మంత్ర ముగ్ధులయ్యారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories