వాహనదారులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు

వాహనదారులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లోనే వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు
x
Highlights

కొత్తగా వాహనాలను తీసుకున్నవారు బండ్ల రిజిస్ట్రేషన్ కోసం, వాటి రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరిగే వారు.

కొత్తగా వాహనాలను తీసుకున్నవారు బండ్ల రిజిస్ట్రేషన్ కోసం, వాటి రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరిగే వారు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా నూతనంగా వాహనాలు కొనుగోలు చేసే వారి కోసం ఆర్టీఏ శుభవార్తను తెలిపింది. ఈ నెల 10వ తేదీ నుంచి వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లను ఆన్‌లైన్‌ ద్వారా కేటాయించనుంది. ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, మలక్‌పేట, బండ్లగూడ రవాణాశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ నంబర్లకు ఈ-బిడ్డింగ్‌ ద్వారా వేలాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది రవాణా శాఖ.

ఇందులో భాగంగా దరఖాస్తుదారు ఏ నంబరుకైతే అత్యధికంగా కోట్‌ చేస్తారో సదరు నంబర్‌ అతనికి కేటాయించనున్నారు. ఈ ప్రక్రియను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తరువాత బిడ్‌ మొత్తం చెల్లించేందుకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయం ఇస్తామని తెలిపారు. బిడ్ చెల్లించిన తరువాత రసీదుతో పాటు రిఫరెన్స్‌ నంబర్‌ పొందే అవకాశం ఉందన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎస్‌ఎంఎస్‌ ద్వారా వాహనదారుడికి నంబర్‌ పంపనుంది రవాణా శాఖ.

ఈ విషయంలో దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారు 040-23370081, 23370083, 23370084 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. ఈ పద్ధతి ద్వారా వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సులువుగా రిజిస్ట్రేషన్ పని జరుగుతుందని అన్నారు. ఈ పద్ధతి ద్వారా గంటల తరబడి కార్యాలయంలో క్యూలైన్లో నిలుచుని అవస్థలు తొలగుతాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories