Telangana: సొంత జిల్లాలకు ఉద్యోగుల బదిలీ.. కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల సర్దుబాటు

Transfer of Employees to Home Districts in Telangana
x

సొంత జిల్లాలకు ఉద్యోగుల బదిలీ

Highlights

*వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్న సర్కార్ *ఉద్యోగుల విభజన ప్రక్రియపై గందరగోళం

Telangana: గతంలో సాధారణ బదిలీలు చేస్తే జిల్లాలో ఏ మూలకు వెళ్లాల్సి వస్తుందో అని ఉద్యోగులు ఆందోళన చెందేవారు. కానీ ప్రస్తుతం అలా కాకుండా విచిత్రమైన పరిస్థితి చూడాల్సి వస్తోంది. రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఎక్కడా బదిలీ అన్న మాటే రాకుండా అలకేషన్ పేరుతో చేపట్టిన ప్రక్రియతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాము పుట్టింది ఎక్కడ. చదివింది ఎక్కడ. ఉద్యోగం చేస్తున్నది ఎక్కడ. భవిష్యత్‌లో చేయాల్సింది ఎక్కడ.. ఇలా అలకేషన్ విష‍యంలో ప్రతీదీ అస్పష్టతగా ఉంది. ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయిస్తుందనేది అధికారులకు సైతం అంతుచిక్కని ప్రశ్నలా మారింది. అంతా IFMIS కే తెలుసని అధికారులు చెబుతుండటాన్ని బట్టి చూస్తే విభజన ప్రక్రియ గందరగోళంగా ఉందనే విషయం అర్ధమవుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని శాఖలకు సంబంధించి సుమారు 38 వేల మంది ఉద్యోగులు ఉంటారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బదిలీలలో ప్రతీ ఉద్యోగి ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని జిల్లాలను ఆప్షన్లుగా ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. నూతన కేడర్‌లకు కేటాయింపుల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎవరికీ అర్థం కాని రీతిలో ఉందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ స్థాయి కేడర్‌లపై ఎలాంటి స్పష్టత లేదు. స్థానికత లేకుండా సీనియారిటీని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని అటు ఉద్యోగులు, ఇటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

తాజా నిబంధనల ప్రకారం జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ స్థాయిల్లో కేడర్‌ స్ట్రెంత్‌పై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌, ఆఫీస్‌ సబ్ ఆర్డినేట్‌ తదితర జిల్లాస్థాయి కేడర్‌ పోస్టులకు ఆప్షన్లు పూర్తయినప్పటికీ నూతన జిల్లాల వారీగా కేడర్‌ స్ట్రెంత్‌పై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు. దీంతో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయో తెలియక, అలాట్‌మెంట్‌ ప్రక్రియలో తాము ఎక్కడకు వెళ్తామో తెలియక ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. జోనల్‌, మల్టీ జోనల్‌ పోస్టులకు సంబంధించిన విభజన ప్రక్రియపై కూడా అదే అస్పష్టత నెలకొంది.

కొత్త జిల్లాల ఏర్పాటుతో అక్కడ పనిభారానికి సమానంగా ఉద్యోగుల కేటాయింపులు లేవు. విభజన ప్రక్రియలో పనిభారానికి సమానంగా ఉద్యోగుల కేటాయింపులు జరుపుతారనే ఉద్యోగుల ఆశలు గల్లంతయ్యాయి. స్థానికత ఆధారంగా నూతన్‌ జోన్‌లకు కేటాయిస్తామని గతంలో ప్రభుత్వం చెప్పిన మాటలు ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పోయాయని ఉద్యోగులు అంటున్నారు. కేవలం సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు జరిపితే జూనియర్లకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు వాపోతున్నారు. కాళేశ్వరం, యాదాద్రి జోన్‌లకు వెళ్లే వారికి భద్రాద్రి జోన్‌ పరిధిలోని వరంగల్‌, హనుమకొండ జిల్లా కేంద్రాలతో సంబంధం లేకుండా పోయే పరిస్థితి వస్తుందనేది ఓ వాదన.

Show Full Article
Print Article
Next Story
More Stories