Balagam Mogilaiah: టాలీవుడ్ లో విషాదం..బలగం మొగిలయ్య కన్నుమూత

Balagam Mogilaiah: టాలీవుడ్ లో విషాదం..బలగం మొగిలయ్య కన్నుమూత
x
Highlights

Balagam Mogilaiah: బలగం సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన...

Balagam Mogilaiah: బలగం సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మొగిలయ్య వైద్య ఖర్చులు బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, చిత్ర యూనిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడంతో అనారోగ్యానికి గురయ్యారు. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేస్తున్న క్రమంలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య , కొమురమ్మ దంపతులు బుర్ర కథలు చెప్పుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళ బుర్రకథను చెప్పడమే వీళ్లకు జీవనాధారం. మంచిర్యాల, గోధావరిఖని, కరీంనగర్ , సిరిసిల్ల జిల్లాల్లో బుర్రకథ చెబుతూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. కాగా ఈ దంపతులు బలగం సినిమాలో క్లైమాక్స్ లో పాడిన పాట మంచి హిట్ అయ్యింది. దీంతో ఆ దంపతులకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories