ములుగు జిల్లాలో విషాదం.. గోదావరిలో ఈతకు వెళ్లి నలుగురు గల్లంతు

ములుగు జిల్లాలో విషాదం.. గోదావరిలో ఈతకు వెళ్లి నలుగురు గల్లంతు
x
Highlights

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంకటాపురం మండలం మరికల గోదావరి రేవు వద్ద గోదావరి స్నానానికి వెళ్ళి నలుగురు యువకులు గల్లంతయ్యారు

ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంకటాపురం మండలం మరికల గోదావరి రేవు వద్ద గోదావరి స్నానానికి వెళ్ళి నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం రంగరాయ పురం గ్రామానికి చెందిన 16 మంది గోదావరి స్నానానికి వెళ్ళగా.. వారిలో శ్రీకాంత్, కార్తీక్, అన్వేష్, ప్రకాష్ అనే యువకులు గల్లంతయ్యారు. ఇందులో ఒకరి పుట్టినరోజు కావడంతో వీరంతా గోదావరి తీరానికి వెళ్లి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత కేక్ కటింగ్ పూర్తయిన అనంతరం అందరూ కలిసి సరదాగా ఈత కొట్టేందుకు గోదావరిలో దిగారని చెబుతున్నారు.

మరోవైపు 16 మంది గోదావరిలో దిగగా 12 మంది పైకి వచ్చారు. మిగతా వారి అటువైపు చేరి ఉంటారని అనుమానం వ్యక్తం కాగా ఎంతకీ తిరిగి రాకపోవడంతో పొలీసులకి సమాచారం అందించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. గల్లంతైన వారిలో రాయవరపు ప్రకాశ్‌, తుమ్మ కార్తీక్‌ మృతదేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. చీకటి కావడంతో వారిని వెతకడం కాస్త ఇబ్బందిగా మారింది.

అటు కామారెడ్డి జిల్లాలో వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో పడి ఇద్దరు గల్లంతయ్యారు కామారెడ్డి జిల్లా కల్లేరు మండలానికి చెందిన ఐదుగురు యువకులు సుమెర్‌, శివ, బాలరాజు, మన్నన్‌, ప్రశాంత్‌ నిజాంసాగర్‌ డ్యాంను చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో వరద గేట్ల సమీపంలో ఒడ్డున స్నానం చేస్తుండగా శివ, సుమెర్‌ ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి గల్లంతయ్యారు. గమనించిన తోటి యువకులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, పోలీసులు గాలింపు చేపట్టి సుమెర్, శివ మృతదేహాలను బయటకు తీశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories