Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం..మహిళా కానిస్టేబుల్ మృతి..ఎస్సై మిస్సింగ్

Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం..మహిళా కానిస్టేబుల్ మృతి..ఎస్సై మిస్సింగ్
x
Highlights

Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. భిక్కనూరు ఎసై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార...

Kamareddy: కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. భిక్కనూరు ఎసై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే యువకుడు ఒకేసారి మిస్స్ అయిన ఘటన జిల్లాలో కలకలం రేపింది.

సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున వారి వస్తువులు కనిపించడంతో పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. బుధవారం అర్థరాత్రి శ్రుతి, నిఖిల్ డెడ్ బాడీలు చెరువులో లభ్యం అయ్యాయి. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆధ్వర్యంలో పోలీసులు, ఎస్సై ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

భిక్కనూరు ఎస్సై సాయికుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో పోలీసులు అధికారులు ఆయన కోసం ఆరా తీశారు. బీబీపేట పీఎస్ లో పనిచేస్తున్న శ్రుతి బుధవారం ఉదయం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం అయినా తమ కూతురు రాకపోవడంతో గాంధారి మండలం గుర్జాల్ లో ఉంటున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.

స్టేషన్ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు దగ్గర ఉన్నట్లు గుర్తించారు.

ఎస్పీ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు రాత్రి 11గంటల ప్రాంతంలో చెరువు వద్ద కానిస్టేబుల్ శ్రుతి సెల్ తోపాటు బీబీపేటకు చెందిన నిఖిల్ ఫోన్ కూడా దొరికింది. భిక్కనూరు ఎస్సై సాయికుమార్ కారు, చెప్పులు, నిఖిల్ చెప్పులు కనిపించాయి. అనుమానంతో చెరువులో గాలించడంతో ఇద్దరి డెడ్ బాడీలు దొరికాయి. ఎస్సై ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో ఏం జరిగి ఉంటుందో అంతుచిక్కడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories