Hyderabad Traffic Alert: నేడు, రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..అటు వైపు వెళ్లారో పద్మవ్యూహంలో చిక్కినట్లే

Traffic restrictions in Hyderabad today and tomorrow on the occasion of Lashkar Bonalu
x

Traffic Alert:నేడు, రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..అటు వైపు వెళ్లారో పద్మవ్యూహంలో చిక్కినట్లే

Highlights

Hyderabad Traffic Alert: లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ రోడ్లన్నీ భక్తులు, బోనాలతో నిండిపోయాయి. దీంతో నేడు, రేపు హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏయే ప్రాంతాల వైపు వెళ్లకూడదో తెలుసుకుందాం.

Traffic restrictions in Hyderabad: లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. ఓ వైపు ముసురు పెడుతున్నా..అమ్మవారి బోనం ఎత్తి మహంకాళి దేవాలయానికి కదులుతున్నారు భక్తులు. దీంతో అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పిస్తున్నారు.పలు ప్రాంతాల నుంచి లష్కర్ పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండటంతో సికింద్రాబాద్ దారులన్నీ బోనాలు, భక్తులతో నిండిపోయాయి. అదేవిధంగా నేడు, రేపు జరుగుతున్న ఈ వేడుకలకు నగరంలోని పలు ప్రాంతాలనుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

-క‌ర్బాలా మైదాన్,

-రాణిగంజ్,

-రామ్‌గోపాల్‌ఫేట్ ఓల్డ్ పీఎస్,

-పార‌డైస్,

-సీటీవో ప్లాజా,

-ఎస్బీఐ ఎక్స్ రోడ్,

-వైఎంసీఏ ఎక్స్ రోడ్,

-సెయింట్ జాన్స్ రోట‌రీ,

-సంగీత్ ఎక్స్ రోడ్,

-ప్యాట్నీ ఎక్స్ రోడ్,

-పార్క్‌లేన్,

-బాటా,

-బైబిల్ హౌజ్,

-మినిస్టర్ రోడ్,

ర‌సూల్‌పురా వైపు వ‌చ్చే వాహ‌న‌దారులు ప్రత్యామ్నాయ మార్గాల‌ ద్వారా వెళ్లాలని సూచించారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వ‌చ్చే ప్రయాణికుల‌ను పోలీసులు అల‌ర్ట్ చేశారు. స్టేష‌న్‌లోకి ప్లాట్ ఫాం నంబ‌ర్ 1 నుంచి కాకుండా ప్లాట్ ఫాం నంబ‌ర్ 10 నుంచి లోప‌లికి చేరుకోవాల‌ని వారికి సూచించారు.

ఈ రోడ్లు మూసివేత‌..

-టోబాకో బ‌జార్ నుంచి మ‌హంకాళి టెంపుల్‌కు వ‌చ్చే రోడ్

-బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వ‌ర‌కు

-జ‌న‌ర‌ల్ బ‌జార్ రోడ్

-ఆద‌య్య ఎక్స్ రోడ్

-మ‌ళ్లింపు మార్గాలు ఇవే..

-సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బ‌స్సుల‌ను చిల‌క‌ల‌గూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ హాస్పిట‌ల్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, క‌వాడిగూడ‌, మారియ‌ట్ హోట‌ల్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

-సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను బేగంపేట నుంచి క్లాక్ ట‌వ‌ర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

-బైబిల్ హౌస్ నుంచి సికింద్రాబాద్ వ‌చ్చే వాహ‌నాల‌ను స‌జ్జ‌నాల్ స్ట్రీట్, సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లేదా హిల్ స్ట్రీట్, రాణిగంజ్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

-SBI ఎక్స్ రోడ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వెహికల్స్ ను ప్యాట్నీ ఎక్స్ రోడ్, ప్యార‌డైస్, మినిస్ట‌ర్ రోడ్ లేదా క్లాక్ ట‌వ‌ర్, సంగీత్ ఎక్స్ రోడ్, సికింద్రాబాద్ స్టేష‌న్, చిల‌క‌ల‌గూడ‌, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, క‌వాడిగూడ‌, మారియ‌ట్ హోట‌ల్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

-ప్యార‌డైస్ నుండి బైబిల్ హౌస్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను ఆర్పీ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు లేదా పార‌డైస్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

-హ‌కీంపేట్, బోయిన్‌ప‌ల్లి, బాలాన‌గ‌ర్, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను క్లాక్ ట‌వ‌ర్ వర‌కే పర్మిషన్ ఇచ్చారు. మ‌ళ్లీ ప్యాట్నీ, ఎస్బీఐ ఎక్స్ రోడ్ మీదుగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు వెళ్లాల్సి ఉంటుంది.

బోనాల జాత‌ర‌కు వ‌చ్చే వారికి పార్కింగ్ స్థలాలు..

-హ‌రిహ‌ర క‌ళా భ‌వ‌న్, మ‌హ‌బూబ్ కాలేజీ, ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్, ఇస్లామియా హై స్కూల్, గ‌వ‌ర్న‌మెంట్ అద‌య్య మెమోరియ‌ల్ హై స్కూల్, ఆద‌య్య ఎక్స్ రోడ్, రాణిగంజ్, సికింద్రాబాద్, మ‌హాత్మా గాంధీ విగ్ర‌హం, ఎంజీ రోడ్, బెల్సన్ తాజ్ హోట‌ల్, అంజ‌లి థియేట‌ర్, ప‌రేడ్ గ్రౌండ్.

Show Full Article
Print Article
Next Story
More Stories