Traffic Police: నగరవాసులకు బిగ్ అలర్ట్..ఈ రోజు నుంచి 5రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..ఈ రూట్లలో వెళ్లకండి

Traffic Police: నగరవాసులకు బిగ్ అలర్ట్..ఈ రోజు నుంచి 5రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..ఈ రూట్లలో వెళ్లకండి
x
Highlights

Traffic Police: వాహనదారులకు ముఖ్య గమనిక. నగరంలో 5 రోజులు పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఏ ఏరియాల్లో రద్దీ ఏర్పేడే అవకాశం ఉందో ఇప్పుడు...

Traffic Police: వాహనదారులకు ముఖ్య గమనిక. నగరంలో 5 రోజులు పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఏ ఏరియాల్లో రద్దీ ఏర్పేడే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. డిసెంబర్ 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి పర్యటన ద్రుష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.

భారత రాష్ట్రపతి కాన్వాయ్ కదులుతున్న సమయంలో ట్రాఫిక్ ను మళ్లించడం లేదంటే కాసేపు ఆపివేయడం జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం 5 నుంచి 7గంటల మధ్య ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలుపుతూ షెడ్యూల్ జారీ చేశారు. హీకంపేట ఎయిర్ ఫోర్స్ నుంచి బొల్లారం, నేవీ హౌస్, యాప్రాల్ రెడ్, హెలిప్యాడ్ వై, బైసన్ ఎక్స్ రోడ్, లోతుకుంట, లాల్ బజార్, త్రిముల్ గేరీ ఎక్స్ రోడ్, హనుమాన్ టెంపుల్, కార్ఖానా, ఎయిర్ టెల్ షోరూమ్, టివోలీ, ప్లాజా, హెచ్ పీఎస్, బేగంపేట, గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట, మోనప్ప, యశోద హాస్పిటల్, కత్రియా హోటల్, రాజ్ భవన్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

డిసెంబర్ 20వ తేదీలో ఉదయం 10 నుంచి 12.30 గంటల మధ్య బైసన్ ఎక్స్ రోడ్డు, అమ్ముగూడ జంక్షన్, లోతుకుంట టి జంక్షన్ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. డిసెంబర్ 20న మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో లోతుకుంట టి జంక్షన్, లాల్ బజార్, హోలీ ఫ్యామిలీ జంక్షన్, త్రిముల్‌ఘెరీ ఎక్స్ రోడ్, హనుమాన్ టెంపుల్, కార్ఖానా, ఎయిర్‌టెల్ షోరూమ్, ఎన్‌సిసి, టివోలి, ప్లాజా, సిటిఓ, రసూల్‌పురా, పిఎన్‌టి, హెచ్‌పిఎస్, బేగంపేట్ ఫ్లైఓవర్ , గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియా హోటల్, రాజ్ భవన్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.

ఇక డిసెంబర్ 21 ఉదయం 9.30 నుంచి 11.30 గంటల మధ్య హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వై జంక్షన్, బొల్లారం చెక్ పోస్ట్, నేవీ హౌస్ జంక్షన్, యాప్రాల్ రోడ్, హెలిప్యాడ్ వై జంక్షన్, బైసన్ ఎక్స్ రోడ్, అమ్ముగూడ జంక్షన్, లోతుకుంట టి జంక్షన్, లాల్ బజార్, హోలీ ఫ్యామిలీ జంక్షన్. , త్రిముల్‌గేరీ ఎక్స్ రోడ్, హనుమాన్ టెంపుల్, కార్ఖానా, ఎయిర్‌టెల్ షోరూమ్, ఎన్‌సీసీ, టివోలి, ప్లాజా, సీటీవో, రసూల్‌పురా, పీఎన్‌టీ, హెచ్‌పీఎస్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్, కత్రియా హోటల్, రాజ్ భవన్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహం ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories