Uttam Kumar Reddy in Speak Up Telangana: కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే ; 'స్పీకప్‌ తెలంగాణ'లో ఉత్తమ్

Uttam Kumar Reddy in Speak Up Telangana:  కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే ; స్పీకప్‌ తెలంగాణలో ఉత్తమ్
x
uttam
Highlights

Uttam Kumar Reddy in SpeakUp Telangana: కరోనా వైరస్ ని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అన్నారు ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి.

Uttam Kumar Reddy in SpeakUp Telangana: కరోనా వైరస్ ని నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అన్నారు ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి.. ఏఐసీసీ పిలుపుమేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 'స్పీకప్‌ తెలంగాణ' కార్యక్రమంలో భాగంగా ఫేస్‌బుక్‌ ద్వారా మాట్లాడిన అయన ఈ వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతున్న క్రమంలో ఇప్పటికి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఉత్తమ్ విమర్శించారు.

ఇక కరోనా చికిత్స పేరిట ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయనని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు. అటు కరోనాతో చనిపోయిన పేద కుటుంబాలను పది లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించాలని అన్నారు. ఇక కరోనాతో పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, పోలీసులకు, జర్నలిస్ట్ లకి, ఆశా వర్కర్లకి, పారిశుధ్య కార్మికులకి ప్రాణహాని జరిగితే రూ.50 లక్షల పరిహారం అందించాలని అన్నారు. ఈ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం ద్వారా పేదలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఉత్తమ్ వాఖ్యానించారు. ఇక శనివారం నిర్వహించిన స్పీకప్‌ తెలంగాణ కార్యక్రమం విజయవంతం అయినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇక తెలంగాణలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి శనివారం(జూలై 18 2020) నాటికి ఉన్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1284 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 43,780కి చేరింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క GHMC పరిధిలోనే అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతుండడం ఆందోళనకి గురి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories