Vajresh Yadav: మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగిన వజ్రేష్ యాదవ్..

TPCC State Vice President Vajresh Yadav Lashes at Malla Reddy
x

Vajresh Yadav: మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగిన వజ్రేష్ యాదవ్.. 

Highlights

Vajresh Yadav: మంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగిన వజ్రేష్ యాదవ్..

Vajresh Yadav: కాంగ్రెస్ పార్టీలో సాధారణ స్థాయి కార్యకర్త కూడా ఎమ్మెల్యే కావచ్చనే దానికి నిదర్శనం తానేనని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాహుల్ గాంధీ గారు తనకు టికెట్టు ఇచ్చి చేయి పట్టుకొని గెలిపించడం వల్లనే తాను ఎమ్మెల్యేని అయ్యానని కర్ణాటక ఎమ్మెల్యే, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ రిజ్వన్ అర్షద్ అన్నారు. మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో మేడిపల్లి లోని సంపూర్ణ హోటల్లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి కర్ణాటక ఎమ్మెల్యే, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రిజ్వాన్ అర్షద్ తో పాటుగా టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ , టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి , డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సరిత వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కర్ణాటక ఎమ్మెల్యే, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారని, ఓటర్లే మనల్ని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, గెలిచేందుకు మనం సిద్ధంగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలందరం ఒక తాటిపై ఉంటూ ప్రణాళికా బద్దంగా పనిచేస్తే మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా పాతడం ఖాయమన్నారు. అనంతరం టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. తన పనుల కోసం ఎలాంటి పనైనా చేసే చెప్రాసి మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాడు టీడీపీ హయాంలో చంద్రబాబు కాళ్ళుమొక్కి రెండు కాలేజీలకు అనుమతులు తెచ్చుకున్నాడని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వైయస్సార్ కాళ్ళు మొక్కి మరో ఎనిమిది విద్యాసంస్థలకు అనుమతులు తెచ్చుకున్నారని, అధికారంలో ఉన్న వారి కాళ్లు మొక్కి వారికి చప్రాసి చేసి తన పనులు చేసుకోవడం మంత్రి మల్లారెడ్డికి అలవాటేనన్నారు.

ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల అనుభవం ముందు మంత్రి మల్లారెడ్డి బచ్చా అన్నారు. మంత్రి మల్లారెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేగా గెలవక ముందే మనలో చాలామంది నాయకులు జడ్పిటీసీలుగా, ఎంపీపీలు, ఎంపీటీసీలు అయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో మనమందరం ఒక్కటై పనిచేస్తే మన గెలుపు నల్లేరు మీద నడికేనన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories