దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్

దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్
x
uttam kumar reddy (File Photo)
Highlights

Dubaka By Elections : తాజాగా టీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే..

Dubaka By Elections : తాజాగా టీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్య కారణాలతో మరణించిన సంగతి తెలిసిందే.. దీనితో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యం అయింది.. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఉపఎన్నికలు నిర్వహించాలి.. అయితే తాజాగా ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక ఈ ఉపఎన్నికల్లో పోటీపై ఎవరేం మాట్లాడినా అది వారి వ్యక్తిగతమని ఉత్తమ్ అన్నారు. త్వరలో దుబ్బాక నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని అయన వెల్లడించారు..

ఇక ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత, కుమారుడు సతీష్‌రెడ్డిలలో ఎవరికి కేసీఆర్‌ టికెట్‌ ఇస్తారన్నది కూడా తేలాల్సి ఉంది. కుటుంబ సభ్యులు మాత్రం సతీష్‌ రెడ్డి పేరును సిఫారసు చేస్తున్నట్లు సమాచారం. .

ఇక గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి విజయం సాధించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దుల నాగేశ్వరరెడ్డి పోటీ చేశారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు వచ్చాయి. నాగేశ్వరరెడ్డికి 26,799 ఓట్లు వచ్చాయి. 62,500 ఓట్ల తేడాతో రామలింగారెడ్డి విజయం సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories