Congress: గాంధీభవన్ లో టీపీసీసీ పీఏసీ సమావేశం

TPCC PAC Meeting in Gandhi Bhavan
x

బట్టి విక్రమార్క (ఫైల్ ఇమేజ్)

Highlights

Congress: టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు ప్రజాకంటకంగా మారాయి-భట్టి

Congress: విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై అక్టోబరు 2 నుంచి డిసెంబరు 9 వరకు నిరంతరంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. తొలిసారిగా సమావేశమైన టీపీసీసీ పీఏసీ సుదీర్ఘంగా జరిగింది. సమావేశం వివరాలను సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. యువనేత రాహుల్‌గాంధీ.. ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలంటూ తీర్మానాన్ని ఆమోదించింది. అసెంబ్లీ ప్రజా సమస్యలపె ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని, క్షేత్రస్థాయిలోనూ పోరాట కార్యక్రమాలు తీవ్రతరం చేయాలని పీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

ప్రకటించారు. అలాగే పంజాగుట్టలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని, లేదంటే కాంగ్రెస్‌ పార్టీయే ఏర్పాటు చేస్తుందని అన్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ కార్యక్రమాన్ని, అక్టోబరు 5న పోడు భూముల సాగు, పోడు భూముల సమస్యలపై 400 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న రాస్తారోకో కార్యక్రమాలను విజయవంతం చేయాలని పీఏసీలో నిర్ణయించినట్లు తెలిపారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డిలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజాకంటక నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. పోడు భూముల సమస్యలపై ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చించి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీద్దామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. పీఏసీలో ప్రత్యేక ఆహ్వానితులుగా పార్టీ సీనియర్‌ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, కోదండరెడ్డిల పేర్లనూ చేర్చాలంటూ వీహెచ్‌, జగ్గారెడ్డి, రేణుకాచౌదరి సూచించారు. ఇందుకు మాణిక్కం ఠాగూర్‌ సానుకూలంగా స్పందించారు. సోనియాగాంధీకి ప్రతిపాదిస్తానని చెప్పారు. కాగా, బీసీ గర్జన మహాసభ నిర్వహిద్దామని వీహెచ్‌ ప్రతిపాదించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories