TPCC Core Committee Meeting : ముగిసిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం

TPCC Core Committee Meeting : ముగిసిన టీపీసీసీ కోర్ కమిటీ సమావేశం
x

Manikam Thakur 

Highlights

TPCC Core Committee Meeting : ఇటీవలే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా మాణికం ఠాకూర్ ను నియమించిన విషయం తెలిసిందే. తమిళనాడు విరుధానగర్...

TPCC Core Committee Meeting : ఇటీవలే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా మాణికం ఠాకూర్ ను నియమించిన విషయం తెలిసిందే. తమిళనాడు విరుధానగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మాణికం ఠాగూర్ ని ఆర్సీ కుంతియా స్థానంలో నియమించిన విషయం తెలిసిందే.

ఇక పోతే ఆయన టీపీసీసీ ఇంచార్జ్ నియామకం అయిన అనంతరం మాణికం ఠాకూర్ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా జూమ్ యాప్ ద్వారా టీపీసీసీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెండు గంటలపాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ సభ్యత్వం, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమారె రెడ్డి మాట్లాడుతూ మాణికం ఠాకూర్ కింది స్థాయి నుంచి పార్టీ లో సంస్థాగతంగా పని చేసారన్నారు. ఎన్. ఎస్. యు.ఐ, యూత్ కాంగ్రెస్ లలో కూడా ఆయన పనిచేసారు. అంతే కాక రెండు సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు. మణీకమ్ ఠాగూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసుకొని రాబోయే 2023 లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని తెలిపారు.

అనంతరం ఏఐసీసీ ఇంచార్జి మాణికం ఠాగూర్ మాట్లాడుతూ ఎన్నో రాజకీయ క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిందన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో బలమైన పార్టీగా తయారుకావాలని ఆయన కోరారు. దీనికోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. పార్టీని సంస్థాగతంగా కింది స్థాయి నుంచి బలోపేతం చేద్దామన్నారు. క్రికెట్ టీమ్ లాగా అందరం కలిసికట్టుగా పనిచేస్తే మనం విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేసారు. తెలంగాణ కాంగ్రెస్ చాలా బలమైన నాయకులు ఉన్నారన్నారు. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, ధోనీలాగా తెలంగాణ లో కూడా గట్టి నాయకులు ఉన్నారు. క్రికెట్ లో ఒక్కరో, ఇద్దరో కష్టపడితే గెలవం. టీం లాగా అంత కలిసి కట్టుగా కష్టపడితే గెలుస్తాం. 2023 లో ఛాలెంజ్ గా తీసుకొని పనిచేసి గెలెవాలన్నారు. తెలంగాణ ఇచ్చినా సోనియా గాంధీకి తెలంగాణలో అధికారంలోకి తెచ్చి బహుమతి ఇవ్వాలన్నారు.

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న తరుణంలో 28 వరకు హౌస్ నడుపుతామని చెప్పి కరోనా పేరు చెప్పి ఈ రోజు ముగిస్తున్నామని స్పీకర్ చెప్పారు. చాలా ముఖ్యమైన అంశాలు చర్చించాల్సివుందన్నారు. ప్రధానంగా కృష్ణ జలాల అంశం చాలా కీలకమన్నారు. ఠాకూర్ నేతృత్వంలో కలిసికట్టుగా పనిచేసి 2023 లో అధికారంలోకి వస్తామని తెలిపారు.

ఎమ్యెల్సి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం జరగబోయే దుబ్బాక ఉప ఎన్నికలు, మూడు కార్పొరేషన్, రెండు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఛాలెంజ్ గా తీసుకొని పని చేయాలని కోరారు. ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాణికం ఠాకూర్ నేతృత్వంలో టీం వర్క్ చేసి కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికలలో విజయం సాధిద్దామని అన్నారు. ఇక ఈ సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎల్ ఆర్.ఎస్, ఆత్మహత్య చేసుకున్న నాగులు అంశాలలో ఉద్యమాలు చేయాలి. కింది స్థాయిలో ఉద్యమాల ద్వారానే పార్టీ బలోపేతం చేయాలని తెలిపారు. అనంతరం కుసుమ కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్, దుబ్బాక, మండలి ఎన్నికలలో ప్రత్యేక ఇంఛార్జీలు నియమించి పనిచేయాలన్నారు. సమావేశంలో కొర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సభ్యత్వాలు, రాబోయే ఎన్నికలకు సంబంధించి సలహాలు ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories