Uttam Kumar Reddy comment on CM KCR: సీఎం కేసీఆర్ కరోనో విషయంలో మొదటి నుంచి తప్పుడు విధానాలతోనే పోతున్నారు

Uttam Kumar Reddy comment on CM KCR: సీఎం కేసీఆర్ కరోనో విషయంలో మొదటి నుంచి తప్పుడు విధానాలతోనే పోతున్నారు
x
Uttam Kumar Reddy (File Photo)
Highlights

Uttam Kumar Reddy comment on CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎమ్యెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు.

Uttam Kumar Reddy comment on CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్యెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరోనో వైరస్ తో జనం అల్లాడుతుంటే ఇంత ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత అవసరమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలనే ప్రధాన్యతగా ఉందన్నారు. ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు, రైతులకు రుణ మాఫీ డబ్బులు లేవు, కొత్త సచివాలయం అవసరమా అని ఆవేదన వ్యక్తం చేసారు.

తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్తితులుంటే ముఖ్యమంత్రి కనీసం వైద్యం పైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడ చీకటిలో ఉన్నారన్నారు. మేము పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని కొరామని అన్నారు. అలా చేస్తే 10 వేల మంది రోగులకు చికిత్స అందించడానికి సౌకర్యంగా ఉండేదన్నారు. కానీ సీఎం తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారన్నారి ఆవేదన వ్యక్తం చేసారు. మొదటినుంచి సీఎం కరోనో విషయంలో తప్పుడు విధానాలతోనే పోతున్నారన్నారు. అందుకే నేడు రాష్ట్రం ఇంతటి దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించాలని కోరారు. ముఖ్యమంత్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలు గమనించి ప్రశ్నించాలన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories