ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ పది ప్రశ్నలు

TPCC Chief Revanth Reddy Ten Questions to CM KCR on Paddy Procurement
x

ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ పది ప్రశ్నలు

Highlights

Revanth Reddy: తెలంగాణ నుంచి ఇక మీదట బాయిల్డ్‌ రైస్ ఇవ్వమని.. కేసీఆర్‌ కేంద్రానికి లేఖ ఇచ్చింది వాస్తవం కాదా..?

Revanth Reddy: ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ పది ప్రశ్నలు సంధించారు. తెలంగాణ నుంచి ఇక మీదట బాయిల్డ్‌ రైస్ ఇవ్వమని కేసీఆర్‌ కేంద్రానికి లేఖ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ లేఖను అడ్డుపెట్టుకొని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మెలిక పెడుతున్నది నిజం కాదా అని నిలదీశారు. కేసీఆరే లే‌ఖ ఇచ్చి ఆయనే ధర్నా చేస్తే మీ మోసాన్ని ప్రజలు గ్రహించలేరని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

యాసంగిలో మొదలు వచ్చే వడ్ల నుంచి రా రైస్ వస్తుందని కొనుగోలు కేంద్రాలు పెట్టకపోవడం రైతులను మోసం చేసే దురుద్దేశం తప్ప మరేమిటి అని రేవంత్ ప్రశ్నించారు. ధాన్యం కొనాల్సిన ప్రభుత్వాలు దగుల్భాజీ రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కష్టం చేసిన రైతు దళారీ చేతిలో దగాపడుతున్నాడని తెలిపారు. ఒకరు ఢిల్లీలో, ఒకరు గల్లీలో నడుపుతోన్న సిల్లీ డ్రామాలలో రైతే సమిధ అవుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్‌కు రాజకీయ సమాధి కట్టేది రైతులేనని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories