కీసర వేదికగా టి.కాంగ్రెస్ శిబిర్

TPCC Chief Revanth Reddy On A Tour Of  America
x

కీసర వేదికగా టి.కాంగ్రెస్ శిబిర్

Highlights

T Congress: తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చ

T Congress: జాతీయ స్థాయిలో కాంగ్రస్ పార్టీ నిర్వహించినట్లుగానే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా చింతన్ శిబిర్ నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. మేడ్చల్ జిల్లా కీసరలో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి చింతన్ శిబిర్ లో వివిధ అంశాలను చర్చించాలని నిర్ణయించారు. ఏఐసీసీ నిర్వహించిన ఉదయ్ పూర్ నవసంకల్ప్ శిబిర్ లో ఏర్పాటు చేసిన తీర్మానాలను ఆమోదించడంతో పార్టీ బలోపేతంతో వచ్చే ఎన్నికల్లో వ్యవహరించాల్సిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశాలకు మొత్తం 108 మందిని ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు.

నవసంకల్ప చింతన్ శిబిర్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చైర్మన్ గా 33 మంది సభ్యులుగా ఆరు కమిటీలను నియమించారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. తెలంగాణ వ్యవహరాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ తో పాటు ఇతర ఏఐసిసి కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.

ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ బహిరంగ సభ వేధిక ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ను ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ర్టంలో టీఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టే ప్రయత్నాలు చేపడుతున్నా రు ఆ పార్టీ నేతలు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు.

అయినా తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చింతన్ శిబిర్ నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా నిర్ణయించారు. వ్యవసాయ రంగం బలోపేతం, సామాజిక న్యాయాలపై నేతలు చర్చించనున్నారు. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాలు ఏవిధంగా అమలు చేయలాన్నదానిపై చర్చ ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కీలక నేతలు లేకుండా నిర్వహించే కాంగ్రెస్ చింతన్ శిబిర్ ఏ విధంగా సాగుతుందోనని పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories