24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టైతే.. నిరూపించాలన్న రేవంత్ రెడ్డి

TPCC chief Revanth Reddy challenges CM KCR
x

24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినట్టైతే.. నిరూపించాలన్న రేవంత్ రెడ్డి 

Highlights

Revanth Reddy: లాగ్ బుక్‌లు తీసుకొని కామారెడ్డికి రా కేసీఆర్

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డిలో కార్యకర్తల ముఖ్య సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే.. ఇటు కామారెడ్డిలోనూ.. అటు కొడంగల్‌లో తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటాన్నారు. ఉపసంహరణకు 3 గంటల వరకూ సమయం ఉందని.. లాగ్ బుక్‌లు తీసుకొని కామారెడ్డికి రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే.. కామారెడ్డి చౌరస్తాలో ముక్కు నేలకు రాసి.. క్షమాపణ చెప్పాలన్నారు. రేవంత్ వ్యాఖ్యలతో కామారెడ్డిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories