Telangana: పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి

Tourist Places Re-Opened in Telangana
x

ములుగు జిల్లాలోని బోగాత జలపాతం (ఫైల్ ఇమేజ్)

Highlights

Telangana: బొగత జలపాతానికి పెరిగిన సందర్శకులు * సందడిగి మారిన పర్యాటక ప్రదేశాలు

Telangana: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పర్యాటక ప్రాంతాలకు అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతానికి సందర్శకులు తాకిడి పెరిగింది. అయితే పర్యాటకులు తప్పనిసరిగా మాస్కులు ధరించి కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. కరోనా కారణంగా పర్యాటక ప్రాంతాల సందర్శన నిలిపివేయడంతో ప్రకృతి అందాలను ఆస్వాదించే పర్యాటకులు నిరాశకు లోనయ్యారు. కరోనా సృష్టించిన విలయంతో పర్యాటకులు లేక బోసిపోయిన సుందర ప్రదేశాలు పున: ప్రారంభం కావడంతో పర్యాటక ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. తెలంగాణ జలపాతం బొగత గలగలమంటూ ఉరకలు వేస్తోంది. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటూ కొత్తనీటితో నూతన కళ సంతరించుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories