Top-6 News of the Day: ఫిరాయింపులపై కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఫిర్యాదు మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day (20/07/2024)
x

Top-6 News of the Day: రేవంత్ పై గవర్నర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు మరో 5 ముఖ్యాంశాలు

Highlights

Top-6 News of the Day (20/07/2024)1. భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారు: కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి...

Top-6 News of the Day (20/07/2024)

1. భయపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారు: కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్

తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ నేతృత్వంలోని ఆ పార్టీ నాయకులు శనివారం రాజ్ భవన్ లో గవర్నర్ రాధాకృష‌్ణన్ ను కలిశారు. పార్టీ ఫిరాయింపులతో పాటు ఇతర అంశాలపై ఫిర్యాదు చేశారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ లో చేర్చుకున్న విషయమై న్యాయపోరాటం చేస్తున్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా కేటీఆర్ చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తుంగలో తొక్కిందో గవర్నర్ కు వివరించామన్నారు.


2. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రామరాజుపాలెం వద్ద వంతెనపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కేడీపేట-చింతపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పులిచింతల ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. రాజమండ్రి వద్ద గోదావరిలో వరద ప్రవాహం 7.8 అడుగులకు చేరింది. అనకాపల్లి జిల్లా కళ్యాణపులోవ జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విశాఖ జిల్లా్ల్లో భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అల్లూరి జిల్లాలోని చింతూరు-కల్లేరు గ్రామాల మధ్య 316 నెంబర్ జాతీయ రహదారి కోతకు గురైంది. దీంతో ఈ మార్గంలో ఆంధ్రప్రదేశ్-ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరో వైపు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది.


3. యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోని సోమవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టుగా చెబుతున్నారు. 2029 మే వరకు ఆయన పదవీకాలం. ఐదేళ్ల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ప్రొబేషనరీ ఐఎఎస్ అధికారి పూజా ఖేడ్కర్ అంశం తెరపైకి వచ్చిన తర్వాత యూపీఎస్సీ చుట్టూ వివాదాలు, ఆరోపణలు వచ్చాయి. అయితే మనోజ్ రాజీనామాకు పూజా ఖేద్కర్ అంశానికి ఎలాంటి సంబంధం లేదని యూపీఎస్ సీ వర్గాలు చెబుతున్నాయని ఓ జాతీయ మీడియా తెలిపింది.


4. హైద్రాబాద్ అభివృద్దికి హైడ్రా వ్యవస్తను తెస్తున్నాం: రేవంత్ రెడ్డి

తెలంగాణకు హైద్రాబాద్ ద్వారానే 65 శాతం ఆదాయం జంట నగరాల నుంచే వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గోపన్ పల్లి ఫ్లైఓవర్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ది చెందుతుందన్నారు. హైద్రాబాద్ అభివృద్దికి హైడ్రా వ్యవస్తను తెస్తున్నామన్నారు.


5. కర్నూల్ విద్యార్ధినికి ఆర్ధిక సాయం చేసిన సినీ నటుడు సోన్ సూద్

బాలీవుడ్ నటులు సోనూసూద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ విద్యార్ధినిక ఆర్ధిక సాయం చేశారు. ఆస్పరి మండలం బనవనూరుకు చెందిన విద్యార్ధిని దేవికుమారి బీఎస్సీ చదవాలని భావించింది. ఆర్ధిక పరిస్థితి సహకరించని కారణంగా తన చదువుకు సహకరించాలని ఆమె సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో సోనూసూద్ కు చేరింది. ఆ విద్యార్ధినికి సాయం చేస్తానని ఆయన రిప్లై ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగానే ఆయన ఆ విద్యార్ధినికి ఆర్ధిక సహాయం అందించారు. ఆర్ధిక సాయం అందగానే దేవికుమారి సోషల్ మీడియా వేదికగా సోన్ సూద్ కు ధన్యవాదాలు తెలిపారు.


6. రష్యాతో ఘర్షణ ఆగేలా చూస్తా: జెలెన్ స్కీకి ట్రంప్ హామీ

రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తానని డొనల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్ స్కీకి హామీ ఇచ్చారు. జెలెన్ స్కీతో తాను ఫోన్ లో మాట్లాడినట్టుగా ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తనపై జరిగిన దాడిన జెలెన్ స్కీ ఖండించారని ఆయన చెప్పారు. 2022 లో తాను అధికారంలోకి వస్తే ఈ యుద్ధం జరిగేది కాదన్నారు. ఈ ఏడాది నవంబర్ లో తాను విజయం సాధిస్తే అధికార బాధ్యతలు చేపట్టకముందే యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేస్తానని ట్రంప్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories