Top-6 News of the Day: జూలై 18న లబ్దిదారుల ఖాతాల్లోకి పంట రుణమాఫీ నిధులు మరో 5 ముఖ్యాంశాలు

Rythu Runamafi: రైతులకు శుభవార్త..రేపు వీరి అకౌంట్లోకి మాత్రమే డబ్బులు
x

Loan waiver money to farmers account tomorrow

Highlights

Top-6 News of the Day (16/01/2024)1. జూలై 18న లబ్దిదారుల ఖాతాల్లో పంట రుణమాఫీ నిధులుపంట రుణమాఫీ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జూలై 18న విడుదల...

Top-6 News of the Day (16/01/2024)

1. జూలై 18న లబ్దిదారుల ఖాతాల్లో పంట రుణమాఫీ నిధులు

పంట రుణమాఫీ నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జూలై 18న విడుదల చేయనున్నారు. అదే రోజున రైతులతో కలిసి ప్రజా ప్రతినిధులు సంబరాల్లో పాల్గొంటారు. ఆగస్టు 15 లోపుగా పంట రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకుంది. రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జూలై 15న విడుదల చేసింది. రైతు పాస్ పుస్తకం ఆధారంగానే రుణమాఫీ వర్తిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.


2. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం

ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం జరిగింది. కొత్త ఇసుక విధానం, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ సహకార కార్పోరేషన్ కు ప్రభుత్వం గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.


3. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. తీహార్ జైలులో ఉన్న కవిత అస్వస్థతకు గురైన విషయాన్ని గురించిన జైలు సిబ్బంది ఆమెను దీన దయాళ్ ఆసుపత్రికి తరలించారు. దిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. ఇదే కేసులో సీబీఐ కూడా ఆమెను అరెస్ట్ చేశారు.


4. తెలంగాణలో విద్యుత్ ఒప్పందాలపై విచారణ కమిషన్ కు కొత్త ఛైర్మెన్

విద్యుత్ విద్యుత్ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ కు కొత్త ఛైర్మెన్ ను జూలై 22 లోపుగా నియమిస్తామని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డి పంపిన సమన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించడంపై అభ్యంతరం తెలిపింది. కమిషన్ ఛైర్మెన్ ను మార్చాలని ఆదేశించింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.


5. పెరిగిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు నిరాశ

బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరుగుతోంది. సెప్టెంబర్ లో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చనే అంచనాలున్నాయి. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో రెండు రోజుల క్రితం వరకు 2350 డాలర్ల వరకు ఉన్నాయి. తాజాగా బంగారం ధర ఔన్సు ధర 2440 డాలర్లకు చేరింది.


6. వలస కార్మికులకు రేషన్ కార్డుల జారీపై సుప్రీం కీలక ఆదేశాలు

రేషన్ కార్డుల కోసం ఆన్ లైన్ పోర్టల్ నమోదు చేసుకున్న వలస కార్మికుల వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆన్ లైన్ పోర్టల్ ధరఖాస్తు చేసుకున్న 8 కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories