Telangana Elections: తెలంగాణలో నామినేషన్లకు రేపే( నవంబర్ 10) లాస్ట్​ డేట్

Tomorrow November 10 Is The Last Date For Nominations In Telangana
x

Telangana Elections: తెలంగాణలో నామినేషన్లకు రేపే( నవంబర్ 10) లాస్ట్​ డేట్

Highlights

Telangana Elections: ఇప్పటి వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 713 నామినేషన్లు దాఖలు

Telangana Elections: తెలంగాణలో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. దీంతో అభ్యర్థులు ఇవాళ భారీ సంఖ్యలో నామినేషన్స్ సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలైన 3వ తేదీ ఆశ్వయుజ బహుళ షష్ఠి నుంచి 7వ తేదీ వరకు ముహూర్తాలు బాగా లేకపోవడం, తిథి, నక్షత్రం కలిసి రాకపోవడంతో చాలా మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ముందుకు రాలేదు.

8వ తేదీ బుధవారం తిథి, వారం బాగున్నా... పూర్వఫల్గుణి నక్షత్రం ఉండటంతో పలువురు అభ్యర్థులు మొదటి సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రి గంగుల కమలాకర్, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌లో ఎమ్మెల్యే సతీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు పలువురు నామినేషన్ వేశారు. గురువారం ఏకాదశి కావడం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉండడం, తేదీ తొమ్మిది సంఖ్య ఉండడంతో నామినేషన్‌‌‌‌‌‌‌‌ సమర్పించేందుకు సరైన రోజుని జ్యోతిష్యులు చెప్పడంతో చాలా మంది ఇదే రోజును ఎంచుకున్నారు.

8వ తేదీన నామినేషన్ వేసిన అభ్యర్థులు కూడా సెంటిమెంట్ కోసం 9న మరో సెట్ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చివరి రోజు హస్త నక్షత్రం ఉండటంతో ఆ నక్షత్రం కలిసొచ్చేవాళ్లు, చివరి జాబితాలో బీఫామ్ అందినవాళ్లు ఈరోజు నామినేషన్లు సమర్పించే అవకాశం ఉంది.

గజ్వేల్‌‌‌‌‌‌‌‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవాళ నామినేషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేయనున్నారు. ఉదయం గజ్వేల్‌‌‌‌‌‌‌‌లో, మధ్యాహ్నం కామారెడ్డిలో నామినేషన్‌‌‌‌‌‌‌‌ వేస్తారు. బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ఉదయం 11గంటల 45 నిమిషాలకు సిరిసిల్ల ఆర్డీవో ఆఫీస్‌లో నామినేషన్ దాఖలు చేస్తారు.

మంత్రి హరీష్‌‌రావు ఉదయం సిద్దిపేటలో నామినేషన్​వేయనున్నారు. మంత్రి గంగుల మరో సెట్ పత్రాలు దాఖలు చేస్తారు. నిర్మల్‌‌‌‌‌‌‌‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, దుబ్బాకలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, హుజూరాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో మాజీ మంత్రి జోగు రామన్న, బోధన్‌‌‌‌‌‌‌‌లో మాజీ మంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి, పాలేరులో పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌రెడ్డి, మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్, నకిరేకల్, మునుగోడు ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, రవీంద్ర కుమార్ కూడా ఇవాళే నామినేషన్ వేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories