Tomato Price: పండుగ వేళ షాకిస్తోన్న టమాట ధర.. సెంచరీ దాటేసిందిగా.. అసలు కారణం ఇదేనంట?

Tomato Price: పండుగ వేళ షాకిస్తోన్న టమాట ధర.. సెంచరీ దాటేసిందిగా.. అసలు కారణం ఇదేనంట?
x

Tomato Price: పండుగ వేళ షాకిస్తోన్న టమాట ధర.. సెంచరీ దాటేసిందిగా.. అసలు కారణం ఇదేనంట?

Highlights

Tomato Price: బతుకమ్మ, దసరా పండుగ రానున్న ఈ సమయంలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి.

Tomato Price: బతుకమ్మ, దసరా పండుగ రానున్న ఈ సమయంలో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి... పెరిగిన వంట నూనెలకు తోడు పెరిగిన టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి... టమాటా ధర పెరగడానికి కారణమేంటి..?

ఏ ఇంట్లో అయినా టమాటా లేనిది వంట ముందుకు సాగదు.. ఆ టమాటా ధర ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. కిలో టమాటా ధర కొన్ని చోట్ల సెంచరీ కొట్టింది. బతుకమ్మ, దసరా పండగ రానున్న సమయంలో ఒక్కసారిగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు పేద, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారాయి.

ఇప్పటికే వంటనూనె ధరలు 20 నుంచి 30 రూపాయలకు పెరిగాయి.. మొన్నటి వరకు ఉల్లిగడ్డ ధరలు పెరిగాయి... ఇప్పుడు టమాటా ధరల మోత మోగుతోంది. ఇరవై రోజుల క్రితం కిలో టమాటా 30 నుంచి 40 రూపాయలు పలుకగా, ఐదు రోజుల క్రితం వరకూ 60 రూపాయల చొప్పున విక్రయించారు. ప్రస్తుతం హోల్​సేల్ వ్యాపారులు కూడా కిలో టమాటా 80 రూపాయలకు విక్రయిస్తుంటే, రిటైల్ వ్యాపారులు 100 రూపాయలకు విక్రయిస్తున్నారు.

అయితే డిమాండ్‌కు సరిపడా దిగుబడులు లేకపోవడం వల్లే ధరలు పెరిగాయంటున్నారు హోల్‌సేల్ వ్యాపారులు... తెలుగు రాష్ట్రంలో ఈ ఏడాది సరైన టమాటా దిగుబడి లేకపోవడం ఒక కారణం కాగా.. ఇటీవల వచ్చిన వరదలు కూడా టమాటా కొరతకు కారణం అయ్యాయి అంటున్నారు వ్యాపారులు. ఇటీవల కురిసిన వర్షాలతో టమాటా తోటలు దెబ్బ తినడంతో దిగుమతి నిలిచిపోయింది. ఏపీలోని కల్యాణదుర్గం, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చే టమాటా ఆశించినంతగా రాకపోవడం ఇటు తెలంగాణలో వర్షాల ప్రభావంతో ఇటీవల వరదలకు అక్కడి తోటలు దెబ్బతినడంతో హోల్‌సేల్‌ వ్యాపారులు ధరను ఒక్కసారిగా పెంచేశారు.

మరోవైపు వ్యాపారులే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అంటున్నారు ప్రజలు... పండుగల సీజన్ కావడంతో జనం అవసరాల్ని క్యాష్ చేసుకునేందుకు టమాటా సహా ఇతర కూరగాయల ధరలు అమాంతం పెంచేశారన్న విమర్శిస్తున్నారు.

పండుగల తరువాత ధరలు దిగివచ్చే అవకాశం ఉందంటున్నారు.. ఇలాంటి సమయంలో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. అవసరమైతే టమాటా లాంటి కూరగాయలను ప్రభుత్వమే సబ్సిడీపై సరఫరా చేయాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories