Tomato Price Hike in Hyderabad: ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు..

Tomato Price Hike in Hyderabad: ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు..
x
Highlights

Tomato Price Hike in Hyderabad: కరోనా దెబ్బకు వ్యాపారాలు, కంపెనీలు అన్ని ఎక్కడికక్కడ స్థంబించిపోవడంతో చాలా కుటుంబాలు సగం వేతనంతోనే జీవనం సాగిస్తున్నాయి.

Tomato Price Hike in Hyderabad: కరోనా దెబ్బకు వ్యాపారాలు, కంపెనీలు అన్ని ఎక్కడికక్కడ స్థంబించిపోవడంతో చాలా కుటుంబాలు సగం వేతనంతోనే జీవనం సాగిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు అందరికి అందుబాటులో ఉండే టమాట ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటింది . ఇప్పుడు టమాట కొనాలన్నా , తినాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవలసిన అవసరం ఏర్పడింది . ప్రస్తుతం పెరిగిన ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి . కరోనా పరిస్థితుల ఆధారంగా టమాట ధరలు పెరిగాయని తెలుస్తుంది. వారం క్రితం వరకు నేల చూపులు చూసిన టమాట ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. వారం రోజుల క్రితం కిలో రూ.5 పలికిన ధర ఇప్పుడు ఏకంగా రూ. 50 దాటి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక మార్కెట్లో వీటి ధరల బోర్డును చూసిన జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు పెరిగిపోతే కూరగాయలు కొనేది ఎలా అంటూ సామాన్య ప్రజలు వాపోతున్నారు.

ఇక టమాటా ధరలు ఒక్కసారిగా ఇంతగా పెరిగిపోవడానికి గల కారణాల విషయానికొస్తే ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో డిమాండ్‌కు సరిపడా సరఫరా కావడం లేకపోవడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణ లో పంట తక్కువగా ఉండటంతో ఏపీ, కర్నాటక ప్రాంతల నుంచి తీసుకువస్తున్నామని చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టమాటోలు సరైన రవాణా వ్యవస్ధ లేకపోవడంతో దిగమతులు కావడం లేదు. అంతే కాక రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడా తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు. మరో రెండు నెలల వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో నిన్నా మొన్నటి వరకు రూ. 20 పలికిన టమాట ఇప్పుడు ఏకంగా రూ. 50కి తగ్గడం లేదన్నారు. ఇక ఈ కరోనా పుణ్యమాని లాక్‌డౌన్ విధించడంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయడంతో టమాటాకు గిరాకీ తగ్గుతూ వచ్చింది. అవన్నీ ఇప్పుడు తెరుచుకోవడం, సరఫరా తగ్గడంతో టమాటా ధరలు పైకెగిసాయి. అసలే కరోనా సీజన్.. దీనికి తోడు పన్నుల భారం, పెరిగిన ధరలతో పాటు టమాట కూడా వాత పెట్టడంతో పాపం సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories