Nagarjuna Sagar: ఇవాళ నామినేషన్లకు చివరి రోజు

Today Last day of Nagarjuna Sagar By-Election Nominations
x

Representational Image

Highlights

Nagarjuna Sagar: ఒకేరోజు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు * కాంగ్రెస్‌ నుంచి జానారెడ్డి

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి నామినేషన్‌ల వరకు అన్ని గోప్యం జరుగుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలంతా మండలానికి ఒకరుగా ప్రచారం మరింత ఊపు తెస్తున్నారు.. మరోవైపు ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో హోరా హోరీగా వేయనున్నారు. మూడు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయనున్నారు..

ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత కె.జానారెడ్డి టీఆర్ఎస్ పార్టీ తరుపున నోముల భగత్, బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పానుగోతు రవికుమార్ నాయక్‌ నామినేషన్లు వేయనున్నారు. ఇప్పటికే వీరికి పార్టీలకు సంబంధించిన బీ ఫామ్‌లు కూడా అందాయి. కరోనా ఆంక్షలు ఉండడంతో సాదాసీదాగానే నామినేషన్లు వేయనున్నారు. వీరితో పాటు సాగర్ బరిలో మరో 23 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. భగత్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు జగదీ‌శ్ రెడ్డి, తలసాని హాజరుకానున్నారు. నామినేషన్ దాఖలు చేశాక భగత్ మాడ్గూపల్లి మండలం అభంగాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు.

ఇక బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సాగర్‌లో చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులు కలిపి 23 నామినేషన్లు దాఖలయ్యాయి. అంతేకాదు రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో భారీ ర్యాలీలు, అట్టహాసాలకు తావు లేకుండా సాదాసీదాగానే నామినేషన్ల కార్యక్రమాన్ని ముగించేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories