Telangana Assembly: నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Today is the second day of Telangana Assembly Budget meetings
x

Telangana Assembly: నేడు రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Highlights

Telangana Assembly: నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ

Telangana Assembly: ఇవాళ రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. అసెంబ్లీ సమావేశాలను నాలుగు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. అయితే రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్టెజ్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అసెంబ్లీ పని దినాలను పెంచాలని ప్రతిపక్షాలు సర్కార్‌ను కోరాయి. సబ్జెక్ట్‌ను బట్టి పనిదినాలు పెంచుతామని ప్రతిపక్షాలకు తెలిపింది ప్రభుత్వం.

అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత హాజరుకాకపోవడంతపై అధికార పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై ఫైర్ అవుతోంది. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందంటూ కాంగ్రెస్ ఆరోపించింది. అయితే అదే మోడ్‌లో కాంగ్రెస్‌పై అటాక్ చేసింది బీఆర్ఎస్. సమావేశాలకు ఎప్పుడు రావాలో తమకు తెలుసంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. అధికారం చేపట్టి ఇప్పటికే 60 రోజులు పూర్తయినా.. హామీలు అమలు చేయలేదంటూ ఎటాక్ చేస్తోంది గులాబీ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చేలోపు హామీలు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రశ్నిస్తుందనే భయంతోనే అసెంబ్లీ సమావేశాల పనిదినాలను పెంచడం లేదని ఆరోపిస్తోంది.

మరో వైపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం తయారు చేసిన గవర్నర్ ప్రసంగం పూర్తిగా ఆ పదవి స్థాయిని తగ్గించేలా సిద్ధం చేశారని ఆరోపించింది బీజేపీ. ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి గెలిచనట్టుగానే.. ఇప్పుడు కూడా అబద్ధాలు చెబుతోందంటున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై గవర్నర్ స్పీచ్‌లో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. రుణమాఫీ, జాబ్ క్యాలెండర్, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఎందుకు ప్రస్తావించలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఇక అధికార కాంగ్రెస్‌పై ప్రశ్నల వర్షం కురిపించడానికి రెడీ అయ్యాయి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories