ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ మూడో జాబితా విడుదలయ్యే ఛాన్స్

Today is the Chance to Release the Third List of  T Congress
x

ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ మూడో జాబితా విడుదలయ్యే ఛాన్స్

Highlights

T Congress: ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

T Congress: 100 మంది అభ్యర్థులను ప్రకటించి దూసుకెళ్తుంది తెలంగాణ కాంగ్రెస్. పెండింగ్ లో ఉన్న19 స్థానాలకు కాంగ్రెస్ ఇవాళ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి.. మిగిలిన 19 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక సవాల్ గా మారింది. ఆయా స్థానాల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువగా ఆశావహులు ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ సెకండ్‌ లిస్టు అగ్గి రాజేసింది. టికెట్‌ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలో ఉంటామని హెచ్చరించడంతో... మూడో లిస్టు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది హస్తం పార్టీ. పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ స్థానాల జాబితాలో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్లతో పాటు మంత్రి జగదీశ్‌ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సూర్యాపేటతో పాటు తుంగతుర్తి, మిర్యాలగూడ, చెన్నూరు, కొత్తగూడెం, వైరా, చార్మినార్‌, స్పీకర్ పోచారం ప్రాతినిథ్యం వహిస్తున్న బాన్సువాడ, జుక్కల్, పఠాన్‌చెరు, ఇల్లందు, డోర్నకల్‌, సత్తుపల్లి, నారాయణ్‌ ఖేడ్‌, అశ్వారావుపేట ఉన్నాయి. ఈ స్థానాల్లో తీవ్ర పోటీ నెలకొనడంతో ఏఐసీసీ ఆయా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories