CM KCR: నేడు పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష

Today CM KCR Review Meeting on PallePragathi Program
x

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM KCR: ప్రగతి భవన్‌లో కలెక్టర్లు, అధికారులతో సమావేశం * పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలపై సమీక్ష

CM KCR: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పల్లె, పట్టణ ప్రగతి పురోగతి, అధికారుల పనితీరు, నిధుల వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై సీఎం చర్చించనున్నారు. ఉదయం 11.30లకు ప్రారంభమయ్యే ఈ మీటింగ్‌కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు పాల్గొననున్నారు. ఇందులో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లక్ష్యాలు, సాధించిన విజయాలు, ఇంకా చేయాల్సిన పనులు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్న నిధుల ఖర్చు, హరితహారం, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు..

పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును, అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈనెల 19 తర్వాత తానే స్వయంగా ఆకస్మికంగా తనిఖీలు చేపడుతానని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఎక్కడైనా పనులు జరగకుంటే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా బాగా పనిచేయాల్సి ఉన్నదని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఐఏఎస్ అధికారులు, పంచాయతీరాజ్‌ కమిషనర్లు, సీడీఎంఏ కూడా జిల్లాల్లో పర్యటించి పనుల తీరును పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచించారు. వీటన్నింటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇప్పటిదాకా ఏమేమి పనులు జరిగాయో చార్టులను రూపొందించాలని సీఎస్ సోమేష్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. ప్రగతిలో భాగంగా పచ్చదనం, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, మొక్కలస్థితి, గ్రామ ప్రగతి కోసం తీసుకున్న చర్యలు, గ్రామసభల నిర్వహణ, గ్రామ ప్రగతి నివేదికల మీద జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టులో పొందుపర్చాలని సూచించారు. ఇవాళ జరిగే సమీక్షలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories