Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు

Three Cases Registered Against BRS MLA Padi Kaushik Reddy
x

Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు నమోదు

Highlights

Padi kaushik Reddy: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి.

Padi kaushik Reddy: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. వేర్వేరు ఘటనల్లో మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ పట్ల దురుసుగా ప్రవర్తించారంటూ అతడి పీఏ ఫిర్యాదు మేరకు కౌశిక్‌పై కేసు నమోదు చేశారు వన్‌టౌన్‌ పోలీసులు. అలాగే నిన్న జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో గందరగోళం సృష్టించి, మీటింగ్‌ను పక్కదారి పట్టించారంటూ ఆర్డీవో మహేశ్వర్‌ ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ చైర్మన్‌ మల్లేశం ఫిర్యాదుతో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై మూడో కేసు నమోదు చేశారు పోలీసులు.

నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారిపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వివాదం ముదిరి ఇద్దరూ ఒకరినొకరు తోసుకున్నారు. అక్కడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా తోసుకోవడంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories