Honey bee: ఇంట్లోనే తేనెతుట్టె.. ఈగలు కుట్టవట..

Three and a Half feet Honey Silk  in a House in Mulugu
x

Honey bee: ఇంట్లోనే తేనెతుట్టె.. ఈగలు కుట్టవట..

Highlights

*8నెలల నుంచి ఇంట్లో ఎవరినీ కుట్టలేదన్న యజమాని

Honey bee: సాధారణంగా తేనే తుట్టలు అడవుల్లోనూ, ఎత్తైన చెట్లకు, కొండలకు లేదా బిల్డింగ్‌లోనూ కనిపిస్తుంటాయి. కానీ ఇంట్లోనే పెట్టిన మూడున్నర అడుగుల పొడవాటి తేనే తుట్టే ఆశ్యర్యానికి గురిచేస్తుంది. ములుగు జిల్లా రాజపేటలోని సూరిబాబు ఇంట్లో.. 8 నెలల క్రితం తేనె తుట్ట పెట్టింది. అయితే హాల్లో ఓ మూలకు చిన్నగా మొదలై క్రమంగా స్తంభాకారంలో భారీగా పెరుగుతూ వస్తుంది. ఇంట్లో ఇప్పటివరకు ఎవరిని తేనెటీగలు కుట్టలేదని.. అందుకే తుట్టెను తొలగించే ప్రయత్నం చేయలేదని ఇంటి యజమాని సూరిబాబు తెలిపారు. తేనె తుట్టె ఉండటం వల్ల వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుందని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories