Rajasingh: మరోసారి బెదిరింపు కాల్స్.. సీఎం నెంబర్ ఇచ్చాను..

Threatening Calls To Bjp Mla Raja Singh Again
x

Rajasingh: మరోసారి బెదిరింపు కాల్స్.. సీఎం నెంబర్ ఇచ్చాను..

Highlights

Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

Rajasingh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. బెదిరింపు కాల్స్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ డీజీపీకి రాజాసింగ్ లేఖ రాశారు. వివిధ నెంబర్స్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. తనను చంపేస్తామంటూ కాల్స్ చేస్తున్నారని చెప్పారు. హిందూ ధర్మం కోసం పనిచేయడం మానుకోవాలని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

గత సీఎం కూడా బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపించలేదని....ప్రస్తుత సీఎం కూడా బెదిరింపు కాల్స్‌ను పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో తమ స్వీపర్ సెల్స్ పనిచేస్తున్నాయని బెదిరిస్తున్నారని చెప్పారు. బెదిరింపు కాల్స్ చేసినవారికి సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చానని తెలిపారు. ముఖ్యమంత్రి బెదిరింపు కాల్స్ వస్తే విచారణ సీరియస్‌గా జరుగుతుందన్న ఉద్ధేశంతో నెంబర్ ఇచ్చాన్నారు రాజాసింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories