పోలీసు శాఖలో సీఐ నాగేశ్వరరావు ప్రకంపనలు

Those Who are Working as CI of the Police Station are Taking a lot of Precautions
x

పోలీసు శాఖలో సీఐ నాగేశ్వరరావు ప్రకంపనలు

Highlights

*69 మంది సీఐలను బదిలీ చేసిన సీపీ సీవీ ఆనంద్పో లీసు సిబ్బంది వ్యవహారంపై ప్రత్యేక నిఘా

Hyderabad: సిఐ నాగేశ్వర్ రావు ఎపిసోడ్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. శాఖలో మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చక్కదిద్దే పనిలో పడ్డారు. లాంగ్ స్టాండింగ్ లో ఉన్న 69మంది సిఐలను బదిలీ చేశారు. సిబ్బంది వ్యవహారంపై సిపి స్వయంగా నిఘా పెట్టారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే మహిళల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శాఖలో పని చేస్తున్న వారి పైన ఆరోపణలు వస్తే వారిని సస్పెండ్‌తో సరిపెట్టకుండా సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.

శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడటం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. మారేడ్ పల్లి సిఐ నాగేశ్వర్ రావు వ్యవహారం బయటకు రావడంతో శాఖలో ప్రక్షాళన మొదలైంది. పోలీస్ స్టేషన్ కు సిఐలుగా పని చేస్తున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్న పోలీసులు వాటిని బయట పడకుండా చూసుకుంటున్నారు. కొంత మంది పోలీసులు సంబంధాలను ఆపేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి వ్యవహారం పై సిపిలు స్వయంగా నిఘా పెడుతున్నారు. వివాదస్పదంగా ఉన్న ఎస్ ఐలు, సిఐలకు స్వయంగా వార్నింగ్ లు ఇస్తున్నారు.

ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న పోలీసుల చిట్టాను ఎస్ బి ద్వారా ఉన్నతాధికారులు తెప్పించుకుంటున్నారు. అవినీతికి పాల్పడినా సహించేది లేదంటూ అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. పోలీస్ శాఖ పరువు ప్రతిష్టకు భంగం కలుగకుండా చాలా జాగ్రత్తగా పని చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. చిన్న ఆరోపణ వచ్చిన సహించేది లేదని సస్పెండ్ కాకుండా సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. నాగేశ్వర్ రావు వ్యవహారంతో పోలీస్ పరువు పోయిందని భావించిన పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

హైదరాబాద్ సిటీలో భారీగా సిఐల బదిలీ చేశారు. 69 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. బదిలీలపై సుదీర్ఘ అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు మూడు సంవత్సరాల పాటు లాంగ్ స్టాండింగ్ పోస్టింగ్ లో ఉన్న సిఐలను బదిలీ చేశారు. ఎస్బి, సిసిఎస్, ట్రాఫిక్ లో పని చేసిన ఇన్‌స్పెక్టర్లలకు లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ ఇచ్చారు. ఇక మీదట ప్రతి ఇన్ స్పెక్టర్ వ్యక్తిగత జీవితంపై 360 డిగ్రీలో ఎస్బి ఎంక్వైరీ ఉంటుందన్నారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ లో పనిచేసే ఆఫీసర్ల పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. నాగేశ్వరరావు ఉదంతాన్ని ఇన్‌స్పెక్టర్ల ముందు సీపీ సివి ఆనంద్ ప్రస్తావించారు. యూనిఫామ్ కి ఉన్న గౌరవం నిలబెట్టుకోవాలని ఇన్‌స్పెక్టర్లకు సిపి సివి ఆనంద్ దిశా నిర్దేశం చేశారు. కాదూ కూడదు అంటే తాటతీస్తా అని సీపీ హెచ్చరించారని తెలిసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories