CM KCR: అదే ఫార్ములా.. అదే సెంటిమెంట్

This Time KCR Is Contesting In Kamareddy Along With Gajwel
x

CM KCR: అదే ఫార్ములా.. అదే సెంటిమెంట్

Highlights

CM KCR: నామినేష‌న్ ప‌ర్వాన్ని పండుగ‌లా నిర్వహించాల‌ని గులాబీదళం ఏర్పాట్లు

CM KCR: గ‌జ్వేల్, కామారెడ్డి. ఈ సారి రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు సీఎం కేసీఆర్‌. నామినేషన్‌ ఎప్పుడు వేస్తున్నారో కూడా క్లారిటీ ఇచ్చేశారు. అన్ని ముహుర్తాలు, సంఖ్యాబలం, తిథి, వార నక్షత్రాలను భేరీజు వేసుకొని నవంబర్ 9న ఖాయం చేసుకున్నారు. సెంటిమెంట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే గులాబీ బాస్....తన అదృష్ట సంఖ్యకు సరిపడా నెంబర్‌నే ఎంచుకున్నారు.

ఎప్పటి లాగే ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను, ఫార్ములాను ఫాలో కాబోతున్నారు కేసీఆర్. నామినేషన్‌కు ముందు సిద్ధిపేట జిల్లా కోనాయ‌ప‌ల్లి వెంక‌టేశ్వర స్వామిని ద‌ర్శించుకోబోతున్నారు. నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించబోతున్నారు. కోనాయ‌ప‌ల్లిలో ద‌ర్శనం చేసుకుని అక్కడి నుంచి నామినేష‌న్ వేసేందుకు అట్టహాసంగా బ‌య‌లుదేరతార‌ని తెలుస్తోంది. ఇప్పటి నుంచే నామినేషన్‌కు సంబంధించి, గులాబీ ద‌ళం ఏర్పాట్లు చేస్తోంది. 2018 ఎన్నికల్లోనూ కోనాయ‌ప‌ల్లి వెంక‌టేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే.. నామినేషన్ వేశారు కేసీఆర్. ప్రజా ఆశీర్వాదంతో కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. బంపర్ మెజార్టీతో గులాబీ బాస్ గెలుపొందడమే కాకుండా.. పార్టీకి కూడా అధికారాన్ని నిలబెట్టుకుంది.

ఈ సారి రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ పోటీ చేస్తుండడంతో ఇంకాస్త హడావిడి ఎక్కువైంది. నామినేష‌న్ ప‌ర్వాన్ని గులాబీ పండుగ‌లా నిర్వహించాల‌ని అన్ని ఏర్పాట్లు చేస్తోంది పార్టీ. పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. గ‌జ్వేల్‌, కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం మొత్తం గులాబీమ‌యం చేసేలా చూడాల‌ని కేసీఆర్ ఆదేశించిన‌ట్లు స‌మాచారం. నామినేష‌న్ తర్వాత రెండు నియోజకవర్గాల్లో ఎన్నిక‌ల ప్రసంగం కూడా ఉండ‌బోతున్నట్లు తెలుస్తోంది. ఈ వేదిక‌గానే ప్రతిప‌క్షాల‌ను తీవ్రస్థాయిలో తూర్పార ప‌ట్టబోతున్నారు. సీఎం ఇలాఖాలో కాంగ్రెస్ గెలుస్తుంద‌ని ప్రతిప‌క్షాలు చేస్తోన్న ప్రచారాన్ని తిప్పకొట్టబోతున్నారు గులాబీ బాస్.

గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే కామారెడ్డి బాధ‌్యతలను కేటీఆర్ కు అప్పగించారు. ఇక మంత్రి హరీష్‌రావు తన సొంత నియోజకవర్గం కంటే ఎక్కువగా గజ్వేల్‌లో అన్నీతానై చూసుకుంటున్నారు. వీరితో పాటు రెండు నియోజకవర్గాల్లో మండలానికొక ముఖ్యనేత ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories