Rythu Runa Mafi in Telangana: మూడో విడత రుణమాఫీకి సిద్ధమైన తెలంగాణ సర్కార్

Rythu Runa Mafi in Telangana
x

మూడో విడత రుణమాఫీకి సిద్ధమైన తెలంగాణ సర్కార్

Highlights

Rythu Runa Mafi in Telangana: ఈ ఏడాది జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. జులై 18న మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమాఫీ చేసింది.

Rythu Runa Mafi in Telangana: తెలంగాణ ప్రభుత్వం ఆగస్ట్ 15 వరకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు విడుతాల్లో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడత నిధులను ఖమ్మంలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో మొత్తం రుణాలు తీసుకున్న రైతులు 32.50 లక్షల మంది ఉన్నారు. రైతులను రుణ విముక్తులను చేసేందుకు 31 వేల కోట్ల రుణమాఫీకి అవసరం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ ఏడాది జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. జులై 18న మొదటి విడతగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమాఫీ చేసింది. 11లక్షలా 14వేల 412 మంది రైతులకు 6వేల 34.97 కోట్లు విడుదల చేసింది. జులై 30న అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం నిర్వహించింది. లక్ష నుంచి లక్షా 50 వేల వరకు రుణాలున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. దాదాపు 6లక్షలా 40వేల 823 మంది రైతుల ఖాతాల్లో 6వేల190.01 కోట్లు జమ చేసింది.

12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేసింది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అమెరికా పర్యటన నుంచి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మూడో విడతలో లక్షా 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు. రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులను జమ చేయనుంది.

ఇక 2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. రెండు విడుతాల్లో దాదాపు 12 వేల కోట్లతో రుణమాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడతలో రుణమాఫీ చేయడానికి 6 లక్షలకు పైగా రైతులు ఉంటారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వాటికి దాదాపు 6 వేల నుంచి 7 వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. కానీ బ్యాంకర్లు పెట్టిన మెలికలతో చాలామంది రైతులకు రుణమాఫీ అవ్వక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రభుత్వం బ్యాంకర్లకు సూచనలు చేస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories