KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో నిరుద్యోగులు భేటీ

The unemployed met with BRS working president KTR
x

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో నిరుద్యోగులు భేటీ 

Highlights

KTR: జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి.. ప్రభుత్వం మాట తప్పిం

KTR: తెలంగాణలోని నిరుద్యోగుల‌కు మ‌ద్దతుగా.. బీఆర్ఎస్ పార్టీ క‌దం తొక్కుతుంద‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింద‌ని, ఇచ్చిన హామీ మేర‌కు జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని త‌న నివాసంలో నిరుద్యోగుల‌తో కేటీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌ను నిరుద్యోగులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. తమకు అండగా ఉండాలని నిరుద్యోగులు కోరారని, వారి తరపున కొట్లాడతాం అన్నారు కేటీఆర్. గ్రూప్-2, 3 పోస్టులను పెంచుతామ‌ని చెప్పి ప్రభుత్వం త‌ప్పించుకుందని కేటీఆర్ మండిప‌డ్డారు.


Show Full Article
Print Article
Next Story
More Stories