కల్నల్ సంతోష్ బాబు విగ్రహం సిద్ధం.. ఏపీలో శరవేగంగా విగ్రహ తయారీ పనులు

కల్నల్ సంతోష్ బాబు విగ్రహం సిద్ధం.. ఏపీలో శరవేగంగా విగ్రహ తయారీ పనులు
x
Highlights

భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో అమరుడైన తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబు విగ్రహం శరవేగంగా ముస్తాబవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని శిల్పులు తయారు చేస్తున్నారు.

భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో అమరుడైన తెలుగు తేజం కల్నల్ సంతోష్ బాబు విగ్రహం శరవేగంగా ముస్తాబవుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరంలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని శిల్పులు తయారు చేస్తున్నారు. దేశం కోసం ప్రాణ విడిచిన కల్నల్ సంతోష్ బాబు గౌరవార్ధం ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈనెల 15వ తేదీన తూర్పు లడఖ్ లోని గాల్వాన్ లోయ ప్రాంతంలో భారత దళాలకు చైనా సైనికులకు జరిగిన ఘర్షణల్లో భాగంగా మనదేశానికి చెందిన 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం పొందారు. ఆయన త్యాగాలకు గానూ తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించింది. సీఎం కెసిఆర్ సంతోష్ బాబు స్వస్థలం సూర్యాపేట వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయల నగదును, కల్నల్ సంతోష్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగాన్ని, అలాగే బంజార హిల్స్ ప్రాంతంలో 711 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా సంతోష్ బాబు జ్ఞాపకార్థం విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే శరవేగంగా సంతోష్ బాబు విగ్రహ తయారీ పనులు పూర్తవుతున్నాయి. ఈ వారం రోజులలోపే సూర్యాపేటకు కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని పంపించనున్నారు. సూర్యాపేట పాత బస్టాండ్ కూడలిలో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సంతోష్ బాబు విగ్రహం ప్రారంభం జరగనుంది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుడు సంతోష్ బాబు జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉండాలని, అచ్చం సంతోష్ బాబును అచ్చు గుద్దినట్టే ఆయన విగ్రహం జీవకళతో ఉట్టిపడుతుంది. సైనిక యూనీఫాంలో సంతోష్ బాబు విగ్రహాన్ని దేశభక్తికి ప్రతీకగా తయారు చేస్తుండటం విశేషం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories