Nizamabad: నిజాంషుగర్ ఫ్యాక్టరీల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

The State Government Is Working On Re-Opening Of Nizam Sugar Factories
x

Nizamabad: నిజాంషుగర్ ఫ్యాక్టరీల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

Highlights

Nizamabad: ఎన్‌ఎస్ఎఫ్ కార్మికులు, రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

Nizamabad: నిజాం షుగర్ ఫ్యాక్టరీల పున:ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని, దీంట్లో బాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి ఈనెల 20న నిజాంషుగర్ ఫ్యాక్టరీ అధ్యయన కమిటీ రానుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఫ్యాక్టరీ ప్రారంభించే విషయంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి.. నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. సాధ్యాసాధ్యాల పరిశీలనకు కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందన్నారాయన.. 2015 డిసెంబర్‌ 23న ఫ్యాక్టరీ యాజమాన్యం లే ఆఫ్‌ ప్రకటించిందని తెలిపారు.

8 ఏళ్ల క్రిత మూతపడ్డ ఫ్యాక్టరీపై కార్మికులు, చెరుకు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయని తెలిపారు. కమిటీ చైర్మన్‌గా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కో చైర్మన్‌గా రాష్ట్ర మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, పరిశ్రమల, వాణిజ్య శాఖ సెక్రెటరీ, వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి, డైరెక్టర్‌ ఆఫ్‌ షుగర్‌ అండ్‌ కేన్‌ కమిషనర్లను సభ్యులుగా ఈ కమిటీలో ఉన్నారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories