Telangana: ప్రభుత్వం భూములు విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ మరో దఫా సిద్ధం

The Sector is Ready for the Auction of Government Lands in Telangana
x

Telangana: ప్రభుత్వం భూములు విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ మరో దఫా సిద్ధం

Highlights

Telangana: బహదూర్‌పల్లి, తొర్రూరులో ప్లాట్ల ఈ-వేలాని రంగం సిద్ధం

Telangana: తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలానికి రంగం సిద్ధం అయింది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు వేలం వేసిన భూములతో పాటు మరికొన్ని ఫ్లాట్లను HMDA వేలం వేయబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న బహదూర్​ పల్లిలోని ప్లాట్లను ఆన్​‌లైన్​ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ MSTC ఆధ్వర్యంలో వేలం.. ఈ - ఆక్షన్​ ద్వారా విక్రయించేందుకు హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​‌మెంట్​ అథారిటీ సన్నాహాలు పూర్తి చేసింది. మల్టీ పర్పస్​ జోన్​ కింద ఉన్న ఈ రెండు లే అవుట్లను HMDA ఎండిఏ పూర్తిస్థాయిలో అభివృద్ది చేయనున్నది.

బహదూర్​‌పల్లిలో 101 ప్లాట్లు, తొర్రూర్​‌లో 223 పాట్లను ఈ - ఆక్షన్​ ద్వారా మార్చి మూడో వారంలో విక్రయించబోతున్నారు. గతంలో ఉప్పల్ భాగాయత్‌లో ప్లాట్లను వేలం వేయడం ద్వారా ప్రభుత్వానికి భారీ లాభం వచ్చింది. మేడ్చల్​ మల్కాజ్​‌గిరి జిల్లా పరిధిలోని బహదూర్​ పల్లిలో 40 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న లే అవుట్​‌లో 101 పాట్ల విక్రయాలకు సంబంధించి ఇవాళ ప్రీ బిడ్​ మీటింగ్​ జరుగనున్నది. బహదూర్​‌పల్లిలో మేకల వెంకటేశ్​ ఫంక్షన్​ హాల్​‌లో ఉదయం 11 గంటలకు ప్రీ బిడ్​ మీటింగ్​ ప్రారంభం కానున్నది.

రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్​లో 117 ఎకరాల విస్తీర్ణంలో HMDA లే అవుట్​ను అభివృద్ధి చేస్తుంది. అందులోని 223 ప్లాట్లను ఈ - ఆక్షన్​ ద్వారా విక్రయించనున్నారు. దీనికి సంబంధించి ప్రీ బిడ్​ మీటింగ్​ శుక్రవారం తోర్రూర్​ సైట్​‌లోనే నిర్వహించనున్నారు. గతంలో కోకాపెట్‌లో నిర్వహించిన వేలంలో ప్రభుత్వానికి భారీ లాభం చేకూరింది. ఆ స్థాయిలో కాకున్నా బహదూర్‌పల్లి, తొర్రూరులో జరిగే వేలంలో కూడా ఎక్కువ ధరలు పలికే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories