Runamafi Second List: అన్నదాతలకు శుభవార్త..రుణమాఫీ రెండో జాబితా విడుదలకు సిద్ధం..ఎప్పుడంటే?

farmers-on-loan-waiver-issues-district-administration-focus-on-farmers-problems
x

 Loan Waiver Issues: రుణమాఫీ కాలేదా? అయితే ఇక్కడ దరఖాస్తు ఇవ్వండి..పూర్తి వివరాలివే

Highlights

Runamafi Second List:కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కొటిగా నెరవేరుస్తోంది. ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అన్నట్లుగానే నెరవేరుస్తోంది. మొదటి విడత విడుదల చేసిన సర్కార్..ఇప్పుడు రెండో విడత జాబిత విడుదలకు సిద్ధమైంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Runamafi Second List: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కొటిగా నెరవేరుస్తోంది. ఒకేసారి రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అన్నట్లుగానే నెరవేరుస్తోంది. మొదటి విడత విడుదల చేసిన సర్కార్..ఇప్పుడు రెండో విడత జాబిత విడుదలకు సిద్ధమైంది. జులై 18న రూ. లక్షల వరకు రుణమాఫీ చేసిన సర్కార్..ఈ నెలాఖరులోకా రూ. 1.50లక్షల రుణాలు ఉన్న రైతులు ఖాతాల్లోకి వడ్డీతో సహా జమ చేయనుంది. ఆగస్టు 15వ తేదీలోకా రూ. 2లక్షల రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అటు లక్షలోపు లోన్ తీసుకున్ రైతులకు కూా చాలా మందికి మాఫీ కాలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి అధికారులు పలు రకాల కారణాలు చెబుతున్నారు.

రేషన్ కార్డులో ఎంత మంది రుణం తీసుకున్నా ఒక్కరికి మాత్రమే మాపీ అయితుందని కొన్ని జిల్లాలోని అధికారులు రైతులకు చెబుతుంటే..కుటుంబంలో ఎంత మంది రుణం తీసుకున్నా వడ్డీతో సహ కలిపి రూ. 2లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ రుణమాఫీ ఉంటుందని..వీటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని మంత్రి సూచించారు.

ఇకలక్షలోపు రుణం తీసుకున్నవారికి వడ్డీతో కలిపి లక్షక్రాస్ అయినవారికి మాఫీ కాలేదు. వారికి రెండో విడతలో మాఫీ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే రెండో విడత జాబితా ఎప్పుడు వస్తుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నరు. మొదటవిడత డబ్బులు అకౌంట్లో జమ అయ్యేవరకే రెండో జాబితా ను అధికారులకు పంపించారు. జులై 16న ఈ జాబిత విడుదలయ్యింది. ఎవరి రుణం మాఫీ అవుతుందన్న విషయం ఆ జాబితాలో క్లారిటీ గా ఉంది. రెండో విడత.. అర్హులైన రైతుల వివరాల లిస్ట్ ను జులై 29న ఈ వెబ్ సైట్లో https://clw.telangana.gov.in/Login.aspx అందుబాటులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories