TS LAWCET 2022 : విద్యార్థులకి గమనిక.. తెలంగాణ లా సెట్‌ చివరితేది జూన్‌ 16..!

TS LAWCET 2022 : విద్యార్థులకి గమనిక..  తెలంగాణ లా సెట్‌ చివరితేది జూన్‌ 16..!
x

TS LAWCET 2022 : విద్యార్థులకి గమనిక.. తెలంగాణ లా సెట్‌ చివరితేది జూన్‌ 16..!

Highlights

TS LAWCET 2022 : విద్యార్థులకి గమనిక.. తెలంగాణ లా సెట్‌ చివరితేది జూన్‌ 16..!

TS LAWCET 2022: తెలంగాణలో లా చదవాలనే విద్యార్థులకి ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రభుత్వం లా సెట్‌ చివరితేదీని జూన్‌ 16 వరకు పొడిగించింది. తెలంగాణలో 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి 3, 5 ఏళ్ల లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎల్‌ఎల్‌బీతో పాటు రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్‌ జీబీ రెడ్డి జూన్‌ 7న తెలిపారు.

అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. త్వరలో గడువు ముగుస్తుంది కాబట్టి వెంటనే అప్లై చేసుకుంటే మంచిది. చివరి నిమిషంలో సర్వర్‌ బిజిగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాగా తెలంగాణ లాసెట్‌ నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 2 విడుదలవగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 6 నుంచి జూన్‌ 6 వరకు కొనసాగుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఐతే విద్యార్ధుల విన్నపం మేరకు దరఖాస్తు గడువును జూన్‌ 16 వరకు పొడిగించారు.

ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు ఈ సదావకాశాన్ని సద్వినియోగపరచుకోవల్సిందిగా అధికారులు తెలియజేశారు. ఎల్‌ఎల్‌బీకి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులకు రూ.1000లు దరఖాస్తు ఫీజు నిర్ణయించారు. రూ.500 నుంచి రూ.2 వేల వరకు ఆలస్య రుసుంతో జులై 12 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. పరీక్షలు జులై 21, 22 తేదీల్లో యథాతథంగా జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories