ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వ అప్పీళ్లపై నేడు హైకోర్టు విచారణ

The High Court Will Hear the Government Appeals in the Case of MLAs Purchase Case Today
x

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వ అప్పీళ్లపై నేడు హైకోర్టు విచారణ

Highlights

High Court: సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశించాలని పిటిషన్

High Court: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రభుత్వ అప్పీళ్లపై నేడు హైకోర్టు విచారణ జరుగనుంది. సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశించాలని ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును ప్రభుత్వం సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాం ధర్మాసనం విచారణ జరపనుంది. ప్రభుత్వం, డీజీపీ, సిట్, సైబరాబాద్ సీపీ, మొయినాబాద్ పోలీసుల సంయుక్తంగా అప్పీల్ చేశారు. ప్రతివాదులుగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, తుషార్, నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీలను ప్రభుత్వం చేర్చింది. కేంద్ర ప్రభుత్వం, సీబీఐని కూడా ప్రతివాదులుగా ప్రభుత్వం పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories