TS Assembly: ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం

The Government Will Release The White Paper In The TS Assembly Today
x

TS Assembly: ఇవాళ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం 

Highlights

TS Assembly: 4 నెలల కాలానికి రూ.78, 911.23 కోట్ల బిల్లుకు ఓకే

TS Assembly: నేడు తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే అవకాశమున్నట్టు తెలుస్తుంది. నీటిపారుదలపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రభుత్వం కొద్దికాలంగా చెబుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ మేరకు మేడిగడ్డ పర్యటనకు ముందే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం ఉంది. గత పదేళ్లలో సాగు నీళ్లివ్వడానికి కాకుండా కేవలం కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం కోసమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టిందని తాజా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఈ అంశాలతో పాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, KRMBకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని సైతం శ్వేతపత్రంలో పొందుపరుస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చను పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కాగా... నిన్న అసెంబ్లీ సెషన్లోనే కులగణన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి ఏకగ్రీవ ఆమోదం లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories